దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో శవపంచనామా నిర్వహించనున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు.
శవపంచనామా నిమిత్తం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఉస్మానియా వైద్యులను పిలిపించారు. స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శవపంచనామా జరగనుంది.
తరువాత మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. అక్కడ శవపరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.