ETV Bharat / jagte-raho

కల్వర్టును ఢీకొన్న కారు ... ఒకరి మృతి - కదిరి వార్తలు

కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా కదిరి మండలం మల్లయ్యగారి పల్లి తండా వద్ద చోటు చేసుకుంది.

road accident in kadiri
కదిరిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 24, 2020, 5:27 PM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం మల్లయ్యగారి పల్లి తండా వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భగీరథపల్లికి చెందిన రమేష్​... మరో ముగ్గురితో కలసి తన స్వగ్రామం నుంచి కదిరికి బయలుదేరారు. మల్లయ్య గారి పల్లి తండా వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రమేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సాయంతో అతనిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువచ్చారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న రమేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురికి స్వల్ప గాయాలు కూడా లేకపోవటంతో...మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంపై వాహనంలో ఉన్న మిగతా ముగ్గురిని నిలదీశారు. పోలీసులు కల్పించుకుని ప్రమాద విషయాన్ని తేల్చాలని కోరారు. రమేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవీ చదవండి: శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.