ETV Bharat / jagte-raho

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య - జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, ఏ.రంగంపేటలో విషాదం జరిగింది. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కాళ్లు, చేతులను బ్లేడుతో కోసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

man makes suicide attempt in chittor district with depression
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Aug 5, 2020, 8:40 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో విషాదం జరిగింది. అన్వర్ బాషా అనే వ్యక్తి జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగయ్యగారిపల్లెలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీ గార్డ్​గా పనిచేస్తున్న అన్వర్ భాషా... కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 15 సంవత్సరాల క్రితం అన్వర్ భార్య చనిపోవడంతో రంగంపేటలో ఉంటున్న తన మేనల్లుడు మస్తాన్ ఇంట్లో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కాలు విరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లోని గదికి గడియ పెట్టి బ్లేడ్ల్​తో కాళ్లు, చేతులను కోసుకోగా... తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రామకృష్ణ అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

సిబ్బంది నిర్లక్ష్యం.. రుయా ఆస్పత్రి నుంచి కరోనా రోగి మాయం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.