ETV Bharat / jagte-raho

సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు! - cyber crimes increasing day by day in telangana

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రజలను అమాయకులను చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కొల్లగొడుతున్నారు. విదేశీయులుగా పరిచయం చేసుకుంటూ.. ఖరీదైన వస్తువుల పంపుతున్నామంటూ బాధితుల నుంచి రూ. లక్షలు దోచేస్తున్నారు. హైదరాబాద్​ పరిధిలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి.

cyber crime in hyderabad
బహుమతుల పేరుతో దోచోస్తున్న సైబర్ కేటుగాళ్లు
author img

By

Published : May 25, 2020, 2:43 PM IST

ఇంగ్లాండ్‌ నుంచి ఖరీదైన దుస్తులు, మహిళల చేతి సంచులు, గాజులు, 2 లక్షల బ్రిటిష్‌ పౌండ్లు పంపుతున్నామంటూ తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి(58) నుంచి సైబర్‌ నేరగాళ్లు 1.87 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఈ తరహా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

విదేశీయుల పేరిట..

సైబర్‌ నేరగాళ్లు విదేశీయుల మాదిరిగా సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరుస్తారు. మీతో స్నేహం చేయాలని ఉందంటూ వల విసురుతారు. ఎక్కువ మంది ఇంగ్లాండ్‌కు చెందినవారంటూ పరిచయం చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల స్నేహం తర్వాత ఫోను నంబర్‌ తీసుకుంటున్నారు. బహుమతుల్ని పంపిస్తామని చెప్పి చిరునామా తీసుకుంటారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి..

చిరునామా ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత వాట్సాప్‌లో బహుమతుల ఫొటోలు, కొరియర్‌ రశీదు పంపిస్తారు. సదరు సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేసి రసీదుపై ఉన్న వివరాలను నమోదు చేయాలని సూచిస్తారు. కొరియర్‌ ఎక్కడి వరకొచ్చింది? ఎప్పుడు చేరే అవకాశముందనే వివరాలు కనిపిస్తున్న కారణంగా నమ్మకం కల్గుతుంది. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని.. కస్టమ్స్‌, ఇతరత్రా రుసుములు చెల్లిస్తే పార్సిల్‌ అందుతుందని చెబుతారు. ఒకటి, రెండ్రోజుల్లో చెల్లించకపోతే వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తారు. పలు దఫాలుగా రూ.లక్షల్లో కొల్లగొడతారు. అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి స్పందన ఉండదు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే స్నేహ అభ్యర్థనల విషయంలో అప్రమత్తత అవసరం. బహుమతులు పంపిస్తామంటూ వచ్చే ఫోన్లను నమ్మొద్దు. మోసానికి గురైతే 24 గంటల్లోపు మమ్మల్ని సంప్రదించాలి.

- సీహెచ్‌వై శ్రీనివాస్‌ కుమార్‌, సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ, సైబరాబాద్‌

ఒకేరోజు ముగ్గురికి టోపీ!

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి ఒకే రోజు ముగ్గురు మోసపోయారు.

  • రూ.30 వేలకు ద్విచక్రవాహనం అమ్ముతామని సామాజిక మాధ్యమంలో ప్రకటన చూసి సనత్‌నగర్‌కు చెందిన సుమిత్‌కుమార్‌ వారిని సంప్రదించారు. ముందుగా రూ.20 వేలు ఆన్‌లైన్‌లో పంపారు. మరో రూ.20వేలు అంటూ.. ఇలా రూ.84 వేలు కాజేశారు.
  • చుడీబజార్‌కు చెందిన హృతిక్‌ తన స్నేహితుడికి గూగుల్‌పేలో రూ.2 వేలు పంపారు. డబ్బులు అందని కారణంగా.. కస్టమర్‌ కేర్‌ను సంప్రదించారు. సైబర్‌ నేరగాళ్లు ఫోను ద్వారా లింక్‌ పంపి, హృతిక్‌ ఖాతాలోని రూ.67వేలు డ్రా చేశారు.
  • అక్బర్‌బాగ్‌కు చెందిన వాణీకుమార్‌కు పేటీఎం కేవైసీ అప్‌డేట్‌కు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఫోన్‌ వచ్చింది. డౌన్‌లోడ్‌ చేసినే కొద్ది సేపటికి అతని అకౌంట్లోంచి రూ.80 వేలు డ్రా అయ్యాయి.

ఇదీ చూడండి:

తెలంగాణ: ఆ తొమ్మిది మంది హత్యకు కారణం ప్రేమ!

For All Latest Updates

TAGGED:

dummy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.