సంచలనం సృష్టించిన రూ.11 వందల కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ స్కాంలో నలుగురు నిందితులను 8 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 4 రోజుల విచారణ అనంతరం ఈరోజు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి నిందితులను తరలించారు.
తమకు ఏమి తెలియదని చైనాకి చెందిన వ్యక్తులే అంతా చేశారని సీసీస్ పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. చైనాకి చెందిన నింగ్యాంగ్, డింగ్యాంగ్, లింగ్లింగ్యాంగ్, యాన్హౌ అనే మరో నలుగురు నిందితులు ఈ స్కాంలో ప్రధాన సూత్రదారులని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. చైనాకి చెందిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.