తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారును ఓ గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పహడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: మూడు రాజధానులకు మద్దతివ్వండి: సీఎం జగన్