పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విభాగంలో పని చేసే ఉద్యోగి ఖాతాదారులను మోసం చేశాడు. రాయలం గ్రామానికి చెందిన నక్క సువర్ణ రాజు బ్యాంక్‌కు వచ్చే వాళ్లకు కార్డులు ఇప్పించేవాడు. తర్వాత వారికి మాయమాటలు చెప్పి… తెలివిగా పిన్ నంబర్ తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఖాతాదారులు కూడా బ్యాంకు ఉద్యోగి అని ఓటీపీ చెప్పేవారు. కొద్ది రోజులుగా సువర్ణరాజు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
సువర్ణరాజు సుమారు రూ.40 లక్షల మేర మోసం చెేసినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్బీఐకి, క్రెడిట్ కార్డు విభాగానికి తేడా ఉందని అంటున్నారు. ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఇదీ చదవండి