ఒక్క యోగా ఆసనం వేయాలంటేనే చాలా మంది ఆపసోపాలు పడిపోతుంటారు. అతికష్టం మీద అయిందనిపిస్తారు. అలాంటిది దుబాయిలో ఉండే భారతీయ బాలిక సమృద్ధి కాలియా(11)ను అడగడమే ఆలస్యం.. నిమిషాల వ్యవధిలోనే నిర్దేశించిన స్థలంలోనే అనేక యోగా భంగిమలు చూపుతుంది. గత గురువారం బుర్జ్ ఖలీఫా కట్టడంపై(డెక్‌పై) ఆమె నిమిషాల వ్యవధిలోనే వంద యోగా భంగిమలు వేసిందని ఖలీజా టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఏడో తరగతి చదువుతున్న కాలియా.. ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) రోజున నిమిషం వ్యవధిలో 40 యోగా భంగిమలు వేసి రెండో ప్రపంచ రికార్డును సాధించింది.
ఇదీ చూడండి:ముంచుతున్న నిర్లక్ష్యం 'వరద'