ETV Bharat / international

ప్రపంచంలో అత్యంత మురికి మనిషి కన్నుమూత.. 60ఏళ్లలో ఒకేసారి స్నానం

ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరొందిన అమౌ హజీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సుమారు 60 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి ఆయన స్నానం చేశారు.

Worlds dirtiest man Amou Haj
Worlds dirtiest man Amou Haj
author img

By

Published : Oct 26, 2022, 7:22 AM IST

అమౌ హజీ.. వయసు 94. ఈయనకు స్నానం చేయడమంటే మహా చిరాకు. ఎంతలా అంటే 'ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి' అని పిలిపించుకునేంతగా. ఇరాన్‌లో డెగాహ్‌ గ్రామ శివారులో ఎలాంటి సౌకర్యాలు లేని చిన్నపాటి నివాసంలో ఉండే అమౌ.. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు గ్రామస్థుల ప్రోద్బలంతో సుమారు 60 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్కసారి స్నానం చేశారు. ఇటీవల స్వల్పంగా జబ్బుపడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

సబ్బు, నీరు అంటే అసహ్యించుకునే హజీ అత్యంత ఆరోగ్యవంతుడు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ముళ్ల పందులను వండుకోకుండానే తినేవారు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకుని తాగేవారు. ఎండిన పశువుల పేడను తనదగ్గరున్న పాత పైపులో పెట్టుకుని పొగ తాగడం, నాలుగు సిగరెట్లు ఒకేసారి కాల్చడం అంటే మహా సరదా. అదే సమయంలో స్నానం అంటే మాత్రం ఆమడ దూరం జరిగేవారు. గతంలో ఓసారి స్నానం చేయించడానికి వాహనంలో తీసుకెళుతుండగా మధ్యలోనే హజీ దూకేశారు. కొన్ని దశాబ్దాలపాటు స్నానం చేయకుండా ఉన్న ఆయన్ను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఎలాంటి బ్యాక్టీరియా, పరాన్నజీవుల కారణంగా ఇబ్బంది పడిన దాఖలాలు కనిపించలేదు. పచ్చి మాంసం తినడం వల్ల పేరుకునే ట్రైకినోసిస్‌ అనే బ్యాక్టీరియా కనిపించింది. దీనివల్ల సాధారణ ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుంది. హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి పరీక్షలు నిర్వహించగా అన్నింట్లో 'నెగెటివ్‌' అనే ఫలితమే వచ్చింది.

Worlds dirtiest man Amou Haj
.

ఫ్రెంచి, రష్యన్‌ విప్లవాల గురించి ప్రసంగం
స్నానం చేయకుండా ఉన్నంత మాత్రాన అమౌ హజీ నిరక్షరాస్యుడు అనుకుంటే పొరపాటే. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కావడం గమనార్హం. అంతేకాదు తన దగ్గరకు వచ్చే వారితో ఆయన ఫ్రెంచి, రష్యన్‌ విప్లవాల మంచిచెడుల గురించి చర్చించేవారు కూడా. ఇటీవల కాలంలో పదవులు చేపట్టిన రాజకీయ నేతల గురించి కూడా ఆయనకు తెలుసు. స్నానం చేయకపోవడం కారణంగా తనకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో కష్టాలు పడుతున్నట్లు ఆయన వాపోయేవారు. ఇరుగు పొరుగువారు తనను గౌరవించినప్పటికీ, కొందరు అప్పుడప్పుడు ఎగతాళి చేస్తుంటారని, రాళ్లతో కొడుతుంటారని చెప్పేవారు. అమౌ జీవితంపై 2013లో 'ద స్ట్రేంజ్‌ లైఫ్‌ అమౌ హజీ' పేరుతో ఓ లఘుచిత్రం సైతం విడుదలైంది.

Worlds dirtiest man Amou Haj
.

వారణాసి వ్యక్తి 30 ఏళ్లకుపైగా..
హజీ మరణంతో ప్రపంచంలోనే 'అత్యంత మురికి వ్యక్తి' అన్న అనధికార రికార్డు భారత వ్యక్తికి దక్కనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి శివారులోని ఓ గ్రామానికి చెందిన కైలాస్‌ 'కలౌ' 30 సంవత్సరాలకుపైగా స్నానం చేయకుండా ఉన్నట్లు హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను రూపుమాపేందుకు గాను అగ్నిస్నానం చేస్తున్నానంటూ ఆయన నీటితో స్నానం చేయడానికి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది.

"అగ్ని స్నానం శరీరంలోని అన్ని రకాల సూక్ష్మజీవులను, ఇన్‌ఫెక్షన్లను నశింపజేస్తుంది. ఇది నీటితో స్నానం చేసినట్లే" అని కైలాస్‌ పేర్కొన్నట్లు తెలిపింది. గతంలో కైలాస్‌ కిరాణా దుకాణం నడిపేవారు. స్నానం చేయరన్న ముద్ర కారణంగా ఎవరు దుకాణానికి రాకపోవడంతో రైతుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: బ్రిటన్​లో రిషి శకం ఆరంభం.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరణ

అంధుల పాఠశాలలో మంటలు.. 11 మంది బాలికలు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.