Indiana Mall Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్లోని ఫుడ్ కోర్టులో ప్రవేశించిన ఓ సాయుధుడు రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా నలుగురు మరణించారు. మొదట దుండగుడు ముగ్గురు పౌరులను కాల్చిచంపగా.. అనంతరం ఓ పౌరుడు నిందితుడిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలైనట్లు పేర్కొన్నారు.
ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన మాల్‌కు చేరుకున్నారు. మాల్లోని బాత్రూమ్లో అనుమానస్పదంగా ఓ బ్యాగు కనిపించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టామన్నారు. అనేక ఆయుధాలతో మాల్‌లోకి ప్రవేశించిన సాయుధుడు.. కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.
అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని.. ఇది ప్రజల రక్షణ కోసమేనని బైడెన్ చెప్పారు.
ఇవీ చదవండి:
21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్