ETV Bharat / international

దివాలా గండం నుంచి గట్టెక్కిన అమెరికా.. 'రుణ పరిమితి పెంపు బిల్లు' పాస్ - అమెరికా రుణ పరిమితి పెంపు బిల్లు పాస్

Us Debt Ceiling Bill : అమెరికా గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుకు సెనెట్​ ఆమోదం తెలిపింది. గురువారం రాత్రి బిల్లుపై చర్చ చేపట్టిన సెనెట్​ ఆమోదం తెలిపి.. అధ్యక్షుడి సంతకం కోసం పంపింది. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కినట్లైంది.

us debt ceiling bill
us debt ceiling bill
author img

By

Published : Jun 2, 2023, 9:52 AM IST

Updated : Jun 2, 2023, 10:38 AM IST

Us Debt Ceiling Bill : అమెరికా రుణపరిమితిని పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లుకు సెనెట్​ ఆమోదం తెలిపింది. గడుపు సమీపిస్తున్న వేళ.. గురువారం రాత్రి​ దీనిపై చర్చ చేపట్టింది సెనెట్. అనంతరం ఆమోదం తెలిపి.. అధ్యక్షడు జో బైడెన్​ అనుమతి కోసం పంపింది. దీనికి సంబంధించి అధ్యక్షుడు జోబైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఈ బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైంది. రెండు పార్టీలకు చెందిన మోజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. 314- 117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 165-46 ఓట్ల తేడాతో డెమొక్రాట్‌లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు మద్దతు ఇచ్చారు.

ఈ ఆమోదంతో దివాలా అంచున ఉన్న అమెరికాకు ఊరట లభించింది. అధ్యక్షుడు బైడెన్ సంతకం ఇక లాంఛనమే కాబట్టి బిల్లు వెంటనే చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు ఆమోదం కోసం అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై అధ్యక్షుడు జో బైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు గత శనివారం ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లోని డెమోక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒప్పందానికి వచ్చి.. బిల్లుకు ఆమోదం తెలిపారు.

2021 నాటికి అమెరికా గవర్నమెంట్​ తీసుకున్న అప్పు.. 28.5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.23,53,09,680 కోట్లు) చేరింది. అమెరికా జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించిందే. దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా గవర్నమెంట్​ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేసేందుకు.. బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరింది. కానీ, ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు.. అప్పు పరిమితి పెంచేందుకు తొలుత ససేమిరా అన్నారు. దీంతో గతకొంత కాలంగా కాస్త ఆందోళన నెలకొంది. అనంతరం వీరంతా ఓ ఒప్పందానికి వచ్చి.. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.

డెట్​ సీలింగ్​ అంటే ఏమిటి..?
what is debt ceiling : చెల్లింపుల కోసం యూఎస్​ గవర్నమెంట్​ తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే 'డెట్‌ సీలింగ్‌' అంటారు. అంటే ఈ పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు వీలులేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక భద్రత, మెడికేర్‌, కేంద్ర రుణాలపై వడ్డీలు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, పన్ను రీఫండ్‌లు.. ఇలా అన్ని ఖర్చులు ఈ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి. కాగా మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఎస్​ గవర్నమెంట్​ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం.. ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదన్నమాట. బైడెన్​ ప్రభుత్వం​ జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. అమెరికా ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తూ వచ్చింది.

Last Updated : Jun 2, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.