ETV Bharat / international

మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు సహా ఐదుగురు దుర్మరణం - అమెరికాలో కాల్పులు

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Active shooting underway in US state of North Carolina

author img

By

Published : Oct 14, 2022, 7:53 AM IST

Updated : Oct 14, 2022, 8:34 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. న్యూస్‌ రివర్‌ గ్రీన్‌వే సమీపంలో ఓ యువకుడు కాల్పులు జరపడం వల్ల ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరణించినవారిలో ఒక పోలీస్‌ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఓ గ్యారేజీలో దాక్కున్న నిందితుడ్ని అధికారులు అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి: అయోడిన్‌ టాబ్లెట్లకు ఫుల్​ డిమాండ్​.. కారణాలేంటి?

ఉక్రెయిన్‌ తల్లుల హృదయ ఘోష.. బంకర్లలో దాచిన బిడ్డలను రష్యా అపహరణ!

Last Updated : Oct 14, 2022, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.