ETV Bharat / international

ఉక్రెయిన్​ కోరికలకు నో చెప్పిన అమెరికా.. అందుకేనా! - అమెరికా అధ్యక్షుడు బైడెన్​ లేటెస్ట్ న్యూస్​

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటనలో భాగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్​కు చేస్తున్నది సాయం కాదని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ దేశం పెడుతోన్న పెట్టుబడులను వ్యాఖ్యానించారు. రష్యాపై మా విజయం కేవలం ఉక్రెయిన్‌ విజయమేకాదు, అమెరికా విజయం కూడా అని అన్నారు.

ukraine president volodymyr zelensky
ఉక్రెయిన్​ అధ్యక్షుడు
author img

By

Published : Dec 23, 2022, 7:40 AM IST

ఉక్రెయిన్‌కు మీరు చేస్తున్నది దానం కాదు. మాపై చూపుతున్నది దాతృత్వం కాదు. ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరు పెడుతున్న పెట్టుబడి! రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో మీ సేనలెలా పోరాడాయో ఇప్పుడు పుతిన్‌ నాయకత్వంలోని రష్యాతో మేం అలాంటి పోరే చేస్తున్నాం. రష్యాపై మా విజయం కేవలం ఉక్రెయిన్‌ విజయమేకాదు, అమెరికా విజయం కూడా!.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగమిది. ఉన్నట్టుండి జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించటం వెనక ఆంతర్యమేంటి? ఆయన డిమాండ్లేంటి? అవెంతమేరకు నెరవేరాయి అని చూస్తే..

ఎందుకు నో అన్నారంటే..
పేట్రియాట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో పాటు అడ్వాన్డ్స్‌ యుద్ధట్యాంకులు, దీర్ఘశ్రేణి క్షిపణులు కూడా అమెరికా తమకు ఇవ్వాలని జెలెన్‌స్కీ సలహాదారు మైఖెలో పొదొల్యాక్‌ కోరారు. అమెరికాకు చెందిన అత్యాధునిక ఎం-1 అబ్రామ్స్‌ యుద్ధ ట్యాంకులు కావాలన్నారు. ఈ చిట్టాతోనే జెలెన్‌స్కీ బైడెన్‌ను కలిశారు. పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థకు ఓకే అన్న అమెరికా.. ఎం-1 అబ్రామ్స్‌ యుద్ధ ట్యాంకులు, దీర్ఘశ్రేణి క్షిపణులను అందించటానికి మాత్రం నిరాకరించటం విశేషం. ఇద్దరు అధ్యక్షుల సంయుక్త మీడియా సమావేశంలోనే ఈ విషయాన్ని బైడెన్‌ స్పష్టం చేశారు. "రష్యాపై దాడులు చేయటానికి వీలు కల్పించే క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే నాటో ఐక్యత దెబ్బతినే ప్రమాదముంది. రష్యాతో యుద్ధాన్ని నాటో దేశాలు కోరుకోవటం లేదు" అని బైడెన్‌ చెప్పేశారు. జర్మనీ కూడా.. అమెరికా ఇస్తేనే తామిస్తామంటూ మెలికపెట్టింది.

పర్యటన వెనక..
రష్యాతో యుద్ధం ఆరంభమయ్యాక తొలిసారి జెలెన్‌స్కీ దేశం దాటి బయటకు వచ్చారు. భారీ ఆశలను, డిమాండ్లను మోసుకుంటూ అమెరికా చేరుకున్నారు. పక్కనున్న జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు సహా నాటో దేశాలన్నీ తనకు మద్దతిస్తున్నా.. వారందరినీ కాదని అమెరికాకు ప్రయాణం కావటం వెనక కారణాలు లేకపోలేదు. పెద్దన్న బైడెన్‌ను ప్రసన్నం చేసుకుంటే నాటోలోని అన్ని దేశాలూ ప్రసన్నమైనట్లేననే ఉద్దేశంతో జెలెన్‌స్కీ అమెరికాలో అడుగుపెట్టారు. అంతేగాకుండా.. వచ్చేనెల అమెరికా ప్రతినిధుల సభ కొత్తగా కొలువుతీరబోతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఈ సభ రిపబ్లికన్‌ల వశమైంది. రిపబ్లికన్‌లు జెలెన్‌స్కీకి, ఉక్రెయిన్‌ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారు కొలువు దీరిన తర్వాత వస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించి ముందుగానే అమెరికా పర్యటన పెట్టుకున్నారు జెలెన్‌స్కీ!

సాయం చేస్తున్నా..
యుద్ధం ఆరంభమైన నాటి నుంచీ ఉక్రెయిన్‌కు అమెరికా భారీస్థాయిలో ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. అదే సమయంలో రష్యాతో తెగేదాకా లాగకుండా జాగ్రత్తపడుతుండటం గమనార్హం! అసహాయంగా చేతులెత్తేయకుండా, రష్యాతో పోరాటం కొనసాగించేలా మాత్రమే ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాలు సాయం చేస్తున్నాయి. అంటే.. రష్యా చేస్తున్న దాడుల నుంచి రక్షించుకుంటూ, కొంతమేరకు తిప్పికొట్టేంత మేరకే వీరి సాయం పరిమితమవుతోంది. అంతేతప్ప రష్యా ప్రాంతాలపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి చేసేంతగా మాత్రం కాదు.

కోరికలివి..
ఇకమీదట రష్యాపై తామే ఎదురు దాడి చేసే బలాన్ని కూడా అమెరికా ఇవ్వాలన్నది ఉక్రెయిన్‌ కోరిక. 'రష్యాను నిలువరించాలంటే ఇలా మమ్మల్ని మేం రక్షించుకుంటూ కూర్చోవటం కాకుండా, దాడులు చేస్తున్న ప్రాంతాలను ధ్వంసం చేయాలి' అని ఉక్రెయిన్‌ జాతీయ భద్రతాసలహాదారు జబ్రోద్‌స్కీ ఇటీవలే స్పష్టం చేశారు. అంటే.. రష్యాపై ఎదురు దాడులతో విరుచుకుపడాలంటోంది ఉక్రెయిన్‌! అలా చేయటానికి అవసరమైన దీర్ఘ లక్షిత క్షిపణులను ముఖ్యంగా అమెరికా వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎంఎస్‌)ను, ఎం-1 అబ్రామ్స్‌ యుద్ధట్యాంకులను, జర్మనీ లెపార్డ్‌ మర్దర్‌ యుద్ధట్యాంకులను తమకివ్వాలని కోరింది.

చర్చల ప్రస్తావన?
ఆర్థిక, ఆయుధ మద్దతు అందిస్తూనే.. రష్యాతో చర్చల ప్రస్తావన కూడా బైడెన్‌-జెలెన్‌స్కీ మధ్య వచ్చినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా అమెరికా వైపు నుంచి అడపాదడపా చర్చల మాట వినిపిస్తోంది. కొద్దికాలం కిందట అమెరికా సైన్యాధిపతి చర్చల గురించి ఆలోచించాలని కోరగా.. తాజాగా అమెరికా దౌత్య కురువృద్ధుడు హెన్రీ కిసింజర్‌ సైతం.. రష్యాతో చర్చలకు ఇదే సరైన సమయమని బహిరంగంగా ప్రకటించారు. జెలెన్‌స్కీ రాకకు రెండ్రోజుల ముందే ఆయనీ ప్రకటన చేయటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.