ETV Bharat / international

జాబ్ లేదు.. వీసా టైమ్​ ఆగదు.. 60 రోజులే గడువు​.. అమెరికాలో మనోళ్లపై మాంద్యం పిడుగు - అమెరికాలో ఉద్యోగాల తొలగింపు హెచ్​1 బీ వీసా

అమెరికాలో ఉన్న భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు. 60 రోజుల్లో మరో జాబ్​ సంపాందించకపోతే స్వదేశానికి తిరిగిరావడమే వారికి శరణ్యం. దీంతో కొత్త జాబ్​ కోసం నానా తంటాలు పడుతున్నారు.

indian it professionsla layoffs
indian it professionsla layoffs
author img

By

Published : Jan 23, 2023, 2:55 PM IST

ఆర్థిక మాంద్యం భయాలు తదితర కారణాలతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయ. అలా విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారత ఐటీ నిపుణలకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వారికి ఈ పరిస్థితి మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు వీరు యూఎస్​లో ఉంటాలంటే 60 రోజుల్లో కొత్త జాబ్​ వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

మూడు నెలల క్రితం అమెరికా వెళ్లిన ఓ యువతికి ఇలాంటి సమస్యే ఎదురైంది. ఇటీవల ఇద్యోగాల తొలగింపుల్లో భాగంగా ఆమె తన ఉద్యోగం కోల్పోయింది. మార్చి 20న తన ఆఖరి వర్కింగ్​ రోజు అని లెటర్​ వచ్చింది. హెచ్‌-1బీ వీసాతో అమెరికా వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త జాబ్ వెతుక్కోవాలి. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడమే ఆమెకు శరణ్యం. ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నది ఈమె మాత్రమే కాదు, అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆర్థిక అనిశ్చితులు, మాంద్యం భయాలు తదితర కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు కోతల మొదలుపెట్టాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు సహా ఆదేశంలోని అనేక టెక్‌ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించాయి.

"వేలాది సంఖ్యలో ఐటీ నిపుణులు తొలగింపుల కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాలు ఉన్న వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వీరు ఉద్యోగం కోల్పోయిన నుంచి 60 రోజుల్లోగా కొత్త జాబ్​ సంపాదించాలి. లేదంటే వీసాను మార్చుకోవాలి. ఈ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఉద్యోగులు ఎదుర్కోవాలంటే హెచ్‌-1బీ వీసాదారులకు కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. ఇలాంటి సమస్యల కారణంగా వీరి టర్మినేషన్ తేదీని కొన్ని నెలలు పొడిగించాలి"

--ఎంటర్‌ప్రెన్యూర్‌ అజయ్‌ జైన్ భుటోరియా

ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం గత సంవత్సరం నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో దాదాపు 30 నుంచి 40శాతం ఉన్నది భారత ఐటీ నిపుణులే. వీరిలో చాలా మంది ఉద్యోగులు హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలతో అగ్రరాజ్యంలో ఉంటున్నారు. ఈ పరిస్థితితో ఇప్పుడు వీరంతా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. గడువులోగా కొత్త ఉద్యోగాలు సంపాందించి వీసా స్టేటస్​ను మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, యూఎస్​ టెక్ ఇండస్ట్రీలో ఉన్న ఉద్యోగుల్లో చాలా మంది భారత్​ నుంచి వలస వెళ్లిన వారే. అక్కడి వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేకుంటే 10 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.