సాధారణంగా దొంగలు.. తమ దొరికినవన్నీ దోచుకెళ్తుంటారు. కొన్నిసార్లు పక్కా ప్లాన్ వేసి మరో చోరీ చేస్తుంటారు. అయితే పెరూ దేశంలో మాత్రం ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ చెప్పుల దుకాణంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. సుమారు 200 షూస్‌ను ఎత్తుకెళ్లారు. ఇందులో విచిత్రం ఏమిటి అంటే.. దొంగలు ఎత్తుకెళ్లిన షూస్ అన్నీ కూడా కుడి కాలికి ధరించేవేనట!
పెరూ దేశంలోని సెంట్రల్ హువాన్కాయోలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే దొంగలు ఆ షూస్‌లు అన్నీ కుడి కాలివే అని తెలిసి ఎత్తుకెళ్లారా.. లేదా చీకట్లో కనిపించక ఎత్తుకెళ్లారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దొంగలను అరెస్ట్ చేసి విచారణ జరిపితే అసలు విషయం తేలుతుందని పోలీసులు స్పషం చేశారు. చోరీకి గురైన షూస్‌ల విలువ దాదాపు పది లక్షల వరకూ ఉంటాయని షాపు యజమాని తెలిపారు.
ఈ చోరీ తతంగమంతా షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ముగ్గురు నిందితులు అర్ధరాత్రి వేళ చెప్పుల దుకాణం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు అందులో కనిపించింది. షాపు డిస్ప్లేలో ఉంచిన ప్రముఖ బ్రాండ్ల షూస్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ వంటి సాక్ష్యాలను స్థానిక చీఫ్ పోలీసు అధికారి ఎడువాన్ డియాజ్ సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు. అయితే, కేవలం కుడి కాలి షూస్‌ను ఎత్తుకెళ్లడం పట్ల పోలీసులు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.
-
Huancayo: delincuentes roban más de 200 zapatillas de una tienda, pero todas eran del pie derecho https://t.co/HtpYnelZBe
— El Comercio (@elcomercio_peru) May 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Huancayo: delincuentes roban más de 200 zapatillas de una tienda, pero todas eran del pie derecho https://t.co/HtpYnelZBe
— El Comercio (@elcomercio_peru) May 2, 2023Huancayo: delincuentes roban más de 200 zapatillas de una tienda, pero todas eran del pie derecho https://t.co/HtpYnelZBe
— El Comercio (@elcomercio_peru) May 2, 2023
ఇక్కడ ఒకే కాలి షూస్ చోరీకి గురైన వింత ఘటన లాంటిదే ఓ ప్రాంతంలో మాంసం దుకాణంలోకి చొరబడి కోళ్లు అపహరించారు దొంగలు. చోరీకి గురైన ఆ కోళ్ల విలువ సుమారు 55 వేల దాకా ఉంటుందని షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని ఉందా?.. అయితే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనాన్ని చదవండి.
భక్తితో గుడికి వెళ్తే ఏమోస్తుందిలే అనుకున్నారేమో. కాస్త బరువైనా సరే కష్టపడదాం అనుకున్నారేమో. వరుస పెట్టి ఆలయాల్లోకి ప్రవేశించి గంటలను దొంగలించటం ప్రారంభించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా గుడి గంటలను దోచేసి రికార్డు కొట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏయే గుళ్లలో వారు పనితనం చూపించారు? చివరకు ఎలా దొరికిపోయారు? ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.