ETV Bharat / international

తీవ్ర ఇంధన కొరత.. ఇక సైకిళ్లే దిక్కు.. కి.మీ. పొడవునా జనం బారులు - srilanka news

Sri Lankan Fuel Crisis: శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే.. రాజకీయ సంక్షోభం కూడా తారస్థాయికి చేరింది. అధ్యక్షుడి జాడలేదు. ప్రధాని ఇంటిని నిరసనకారులు తగులబెట్టారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఇంధన కొరత నేపథ్యంలో.. లంక ప్రజలు కార్లు, బైక్స్​ను వదిలి సైకిళ్లకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు.. లంక అధ్యక్ష నివాసం మ్యూజియాన్ని తలపిస్తోంది. అధికార సౌధాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

Sri Lankan fuel crisis: Lankans turn to bicycles, Long queue of protestors on the road leading to the Presidential Palace

author img

By

Published : Jul 12, 2022, 3:51 PM IST

Sri Lankan Fuel Crisis: లంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. జులై 13న రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ప్రధాని రణిల్​ విక్రమసింఘే రాజీనామా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు విపక్షాలు అంగీకరించాయి.

మరోవైపు లంక జనం అష్టకష్టాలతో అల్లాడుతున్నారు. ఆకలి రోదనలు మిన్నంటాయి. ఇంధన కొరతకు తోడు ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు నిత్యావసర ధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. వంటగ్యాస్​ సిలిండర్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ఫిల్లింగ్​ స్టేషన్లు నిండుకున్నాయి. ధరలు కూడా పెట్రోల్​ లీటర్​కు లంక రూపాయల్లో 470కిపైనే. డీజిల్​ను రూ.460కి విక్రయిస్తున్నారు. దీంతో లంక జనం వారి కార్లు, బైక్​లను వదిలిపెట్టి.. సైకిళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆఫీస్​, కాలేజ్​కు​ వెళ్లేందుకు సహా రోజువారీ పనుల కోసం వీటినే వినియోగిస్తున్నారు. దీంతో.. ఒక్కసారిగా సైకిళ్లకు డిమాండ్​ పెరిగింది. సైకిల్ స్టోర్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి.

Long queue of protestors on the road leading to the Presidential Palace
ఇంధనం నింపుకునేందుకు గ్యాస్​ ఫిల్లింగ్​ స్టేషన్​కు ఆటోలు.. అందులోనే నిద్రిస్తున్న డ్రైవర్​
Lankans turn to bicycles, Long queue of protestors on the road leading to the Presidential Palace
సైకిళ్లకు పెరిగిన డిమాండ్​

సైకిళ్లపైనే తిరుగుతున్న లంక జనం

భారీ డిమాండ్​తో సైకిళ్లు కూడా లేక ఖాళీగా దర్శనమిస్తున్న స్టోర్లు

సైకిళ్లపై ప్రయాణిస్తున్న లంకేయులు

మ్యూజియంలా అధ్యక్ష నివాసం: రెండ్రోజుల క్రితం వరకు రణరంగాన్ని తలపించిన శ్రీలంక అధ్యక్ష భవనం పరిసరాలు ఇప్పుడు జనసందోహంతో కళకళలాడుతున్నాయి. శ్రీలంక అధ్యక్ష నివాసం పర్యటక కేంద్రంగా మారింది. అధ్యక్ష నివాసాన్ని చూసేందుకు లంక ప్రజలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయట్లేదు. గొడుగులు పట్టుకొని మరీ రోడ్డు పొడవునా బారులు తీరారు.

అధ్యక్ష భవనాన్ని చూసేందుకు మండుటెండలో గొడుగులతో జనం
Sri Lankan fuel crisis: Lankans turn to bicycles, Long queue of protestors on the road leading to the Presidential Palace
అధ్యక్ష భవనం చూసేందుకు బారులు తీరిన జనం

ఈ నెల 9న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో లక్షలాది మంది ఆందోళనకారులు కొలంబోలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గొటబాయ ముందురోజే అధికార నివాసం వదిలి పారిపోయారు.

లంక అధ్యక్షుడి నివాసంలో భారీగా జనం

దీంతో లక్షలాదిగా వెళ్లిన ఆందోళనకారులు గేట్లు బద్దలుకొట్టి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. ప్రతి గదిలో కలియతిరిగారు. విలాసవంతమైన భవనంతోపాటు అధ్యక్షుడు పొందుతున్న సకల సదుపాయాలు చూసి లంక ప్రజలు ఆశ్చర్యపోయారు. ఖరీదైన సోఫాలు, మంచాలు, ఫర్నీచర్‌ తదితరాలు చూసి స్వర్గమంటే ఇదేరా అనుకుని సంబరపడిపోతున్నారు.

అధికార సౌధంలో సేద తీరుతున్న యువకులు
కొందరు ఏకంగా సోఫాలు, మంచాలపై కునుకు తీస్తున్నారు. అధ్యక్ష భవనంలోని ఖరీదైన పెయింటింగ్‌ వద్ద సెల్ఫీలు దిగుతున్నారు.

గొటబాయ నివాసంలో కునుకుతీస్తున్న లంక ప్రజలు

సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం
అధ్యక్ష నివాసంలోని జిమ్‌ను చూసిన యువకులు కొందరు అయ్య బాబోయ్‌ ఎంత పెద్ద జిమ్‌ అంటూ నోరెళ్లబెట్టారు. మరికొందరు జిమ్‌లలో అధ్యక్షుని నివాసంలో జిమ్‌ వేరయా అంటూ కసరత్తు చేశారు.

జిమ్​లో నిరసనకారుల కసరత్తులు
అధ్యక్ష నివాసంలో భారీ ఈత కొలనును చూసిన మరికొందరు అధికారమంటే ఇదేరా అనుకున్నారు. కొందరు ఔత్సాహికులు ఈతకొలనును చూసిందే తడువుగా ఒక డైవ్‌ కొడితే పోలా అంటూ జలకాలాడారు.

స్విమ్మింగ్​పూల్​లో ఎంజాయ్​ చేస్తున్న యువత

అధ్యక్ష నివాసం ఈతకొలనులో మహిళల సెల్ఫీలు
శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అధ్యక్ష భవనం మ్యూజియంగా కొనసాగే అవకాశం ఉంది.

స్విమ్మింగ్​పూల్​లో సందడే సందడి

రాజపక్సను అడ్డుకున్న అధికారులు: మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు, మాజీ ఆర్థికమంత్రి బాసిల్ రాజపక్స.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సోమవారం సాయంత్రం కొలంబో విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా ఆయనను గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు బసిల్ రాజపక్సను విమానంలో ప్రయాణించేందుకు నిరాకరించారు. క్లియరెన్స్​ ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు.

గొటబాయ రాజపక్స సోదరుడు బాసిల్​ రాజపక్స

లంకకు భారత్​ సాయం: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న లంకకు సాయం చేయడంలో భారత్​ ఎప్పటినుంచో ముందే ఉంటోంది. ఇప్పుడు ఆ దేశ విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా.. భారత్​లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలు తోడ్పడుతున్నాయి. అక్కడ లంక విమానాలను ఇంధనాన్ని నింపుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

Sri Lankan fuel crisis
లంక విమానాలకు భారత్​ ఇంధనసాయం

ఇవీ చూడండి: పురుషుడికి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే..

వచ్చేవారం శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక.. బరిలో విపక్ష నేత ప్రేమదాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.