ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 39 మృతి, 20 మందికి గాయాలు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి.

bus crash in america
bus crash in america
author img

By

Published : Feb 15, 2023, 10:03 PM IST

Updated : Feb 15, 2023, 10:31 PM IST

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో జరిగిందీ ఘటన. కొలంబియా నుంచి డేరియన్​ లైన్​ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలిస్తున్నారు.

"అయితే బస్సు డ్రైవర్ ఆ షెల్టర్​ గేట్​ను దాటి ముందుకు వెళ్లింది. దీంతో మళ్లీ హైవేపైకి వచ్చేందుకు ప్రయత్నించగా మరో బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో వలదారులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది"అని పనామా నేషనల్​ ఇమిగ్రేషన్​ సర్వీస్ డైరెక్టర్​ సమీరా గోజైన్​ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Last Updated : Feb 15, 2023, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.