రక్తం ఏరులై పారిన భీకర పోరు తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెత్క్స్ ప్రావిన్స్‌లో ఉన్న సోలెడార్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో యుద్ధ రంగంలో పలు ఎదురు దెబ్బలు తిన్న రష్యాకు ఇది అరుదైన విజయంగా రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి దొనెత్స్క్, లుహాన్క్స్ ప్రావిన్స్‌లపైనే రష్యా ప్రధానంగా గురిపెట్టింది. వాటిని ఆక్రమించి తమ దేశంలో విలీనం చేసుకుంది. ఈ నెల 12వ తేదీన సోలెడార్ పట్టణం తమ సొంతమైనట్లు రష్యా ప్రకటించింది.
బఖ్‌మత్ నగరంపై గురి
కీలకమైన సోలెడార్‌ను ఆక్రమించడం వల్ల దొనెత్స్క్ ప్రావిన్స్‌లోని బఖ్‌మత్ నగరంలో ఉన్న ఉక్రెయిన్ దళాలకు రవాణాదారులను రష్యా సైన్యం మూసివేయనుంది. అక్కడ ఉన్న ఉక్రెయిన్ దళాలను రష్యా సైన్యం చుట్టుముట్టే వీలుంటుంది. కొన్ని నెలలుగా బఖ్‌మత్ నగరం ముట్టడికి రష్యా విశ్వప్రయత్నం చేస్తోంది.
సాల్ట్‌మైన్స్ ఉండే సోలెడార్‌లో యుద్ధానికి ముందు 10 వేల మంది జనాభా ఉండగా.. బఖ్‌మత్‌లో లక్షకుపైగా జనాభా ఉండేవారు. సోలెడార్‌లో 500 మంది పౌరులు చిక్కుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వీరిలో 15 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు బెలారస్ లేదా రష్యా ఆక్రమణకు ఉక్రెయిన్ యత్నిస్తే బెలారస్ కూడా ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతుందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది
ఇవీ చదవండి: ఛాతిలో లైవ్ గ్రెనేడ్.. ఏ క్షణంలోనైనా పేలిపోయే ఛాన్స్.. ధైర్యంగా సర్జరీ చేసి..
తుమ్మితే ఊడిపోయే అమెరికా స్పీకర్ పదవి.. మెకార్థీ అంతలా లొంగిపోయారా?