ETV Bharat / international

రష్యా రక్షణ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

Russia Defence Ministry Fire: రష్యాలోని టీవర్​ నగరంలోని రక్షణ శాఖ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 27 మంది గాయపడ్డారు. పాతబడిన వైరింగ్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా భావిస్తోంది.

russia
రష్యా
author img

By

Published : Apr 22, 2022, 4:45 AM IST

Russia Defence Ministry Fire: ఈశాన్య రష్యా టీవర్​​ నగరంలోని రక్షణ శాఖ పరిశోధన కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 27 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నామని.. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రష్యన్​ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోస్పేస్​ డిఫెన్స్​ ఫోర్సెస్​ సెంట్రల్​ రీసర్చ్​ ఇన్​స్టిట్యూట్​లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే భవనంలోని పైమూడు ఫ్లోర్లకు కూడా వ్యాపించింది. దీంతో అందులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అధికారుల సూచనల మేరకు భవనం కిటీకల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. ఈ దుర్ఘటనకు కారణం పాతబడిన వైరింగే అని స్థానిక మీడియా భావిస్తోంది. ఈ భవనంలో ప్రధానంగా వాయుసేన సాంకేతికత అభివృద్దికి సంబందించిన పరిశోధనలు జరుగుతుంటాయి.

ఇదీ చూడండి : 'నాటోలో చేరొద్దు'.. ఆ దేశాలకు రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.