ETV Bharat / international

'భారత్​తో వాణిజ్య ఒప్పందం.. చైనాతో తాడోపేడో'.. విదేశాంగ విధానంపై సునాక్ - రిషి సునాక్ ఇండియా ఎఫ్​టీఏ

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశాంగ విధానంపై మాట్లాడారు రిషి సునాక్. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.

UK-SUNAK-INDIA-FTA
UK-SUNAK-INDIA-FTA
author img

By

Published : Nov 29, 2022, 12:03 PM IST

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఫలితంగా.. 2050నాటికి ప్రపంచవృద్ధిలో ఇండో పసిఫిక్ వాటా 50శాతానికి చేరుతుందని తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బ్రిటన్‌ విదేశీ విధానంపై మాట్లాడిన సునాక్‌.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. స్వేచ్ఛా, పారదర్శకత వంటి బ్రిటిష్‌ విలువలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు, బ్రిటిష్‌ విలువలు, ప్రయోజనాలకు చైనా సవాల్‌గా మారినందున ఆ దేశంతో ఇందుకు విరుద్ధంగా పనిచేయనున్నట్లు సునాక్‌ తేల్చిచెప్పారు. చైనా-బ్రిటన్‌ సంబంధాల విషయంలో స్వర్ణయుగం ముగిసిందని పేర్కొన్నారు. చైనా పూర్తిగా నియంతృత్వం వైపు పయనిస్తోందని అన్నారు. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనపైనా మాట్లాడారు సునాక్. ప్రజలను పట్టించుకోకుండా.. వారి ఆందోళనలను అణచివేస్తోందని మండిపడ్డారు. చైనాలో ఇటీవల బీబీసీ రిపోర్టర్​పై జరిగిన దాడినీ ఆయన ఖండించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.