ETV Bharat / international

'రష్యాను ఎవరూ బ్లాక్​మెయిల్ చేయలేరు'.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

Putin On Wagner Group Rebellion : అంతర్యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో దేశ ప్రజలు ఐఖ్యత ప్రదర్శించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ మేరకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాను బ్లాక్​మెయిల్​ చేయాలని, అలజడి సృష్టించాలని ప్రయత్నించినా.. అవేవీ ఫలించవని హెచ్చరించారు. మరోవైపు.. రష్యాపై తాము చేసిన తిరుగుబాటు పుతిన్ సర్కారును పడదోయడానికి కాదని ప్రిగోజిన్ ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ఇంకా ఏమన్నారంటే?

Putin On Wagner Group Rebellion
Putin On Wagner Group Rebellion
author img

By

Published : Jun 27, 2023, 9:02 AM IST

Updated : Jun 27, 2023, 9:22 AM IST

Putin On Wagner Group Rebellion : వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో ఐక్యత ప్రదర్శించినందుకు గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుగుబాటు ముగిసిన తర్వాత తొలిసారి ప్రసంగించిన పుతిన్.. దేశాన్ని రక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అటు పరిస్థితిని రక్తపాతం కాకుండా చూసిన చాలా మంది వాగ్నర్ కిరాయి ముఠా సభ్యులకు కూడా పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.

దీంతోపాటు రష్యాను బ్లాక్​మెయిల్​ చేయాలని, అలజడి సృష్టించాలని ప్రయత్నించినా అవేవీ ఫలించవని హెచ్చరించారు. ఇచ్చిన హామీ ప్రకారం వాగ్నర్​ గ్రూపు సైనికులు బెలారస్​ వెళ్లడానికి అనుమతి ఇస్తున్నానని.. వారు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. ఒకవేళ రష్యాకు సేవ చేయాలనుకుంటే.. రక్షణ శాఖ, మిగతా భద్రత ఏజెన్సీలతో కాంట్రాక్ట్​ చేసుకోవచ్చని తెలిపారు. ప్రిగోజిన్​, మాస్కో మధ్య మధ్యవర్తిగా ఉన్నందుకు బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకషెంకోకు కృతజ్ఞతలు తెలిపారు.

మా ఉద్దేశం అది కాదు : ప్రిగోజిన్
Prigozhin On Putin : మరోవైపు.. వాగ్నర్‌ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ 11 నిమిషాలున్న ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. రష్యాపై తాము చేసిన తిరుగుబాటు పుతిన్ సర్కారును పడదోయడానికి కాదని.. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఎలా కొనసాగించాలో చెప్పి నిరసన వ్యక్తం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు. వాగ్నర్‌కు చెందిన 30 మందిని రష్యా సైన్యం హతమార్చడం వల్లే న్యాయం కోసం తాము కదం తొక్కాల్సి వచ్చిందని వివరించారు.

అయితే ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నది.. భవిష్యత్ ప్రణాళికల ఏమిటనే దానిపై ప్రిగోజిన్ వివరాలు ఇవ్వలేదు. అటు వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు సమయంలో రొస్తోవ్‌ నగరం నుంచి తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు సోమవారం బాహ్య ప్రపంచానికి కనిపించారు. ఉక్రెయిన్‌లోని ఓ స్థావరానికి ఆయన చేరుకుని అధికారులతో మాట్లాడినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

మాకు సంబంధం లేదు.. : బైడెన్
Joe Biden Wagner Group : రష్యాలో వాగ్నర్ గ్రూపు చేసిన తిరుగుబాటులో తమకు, నాటో కూటమికి ఎలాంటి ప్రమేయం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. పాశ్యాత్య దేశాలు లేదా నాటోపై నింద వేసే అవకాశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇవ్వకూడదనే తన అభిప్రాయంతో మిత్రపక్షాలన్నీ ఏకీభవించాయని తెలిపారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలకు తమ మద్దతు కొనసాగుతుందని సోమవారం తేల్చి చెప్పారు.

ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ చెప్పారు. రష్యాపై కిరాయి సైన్యం తిరుగుబాటు సమయంలో బైడెన్ చాలా అప్రమత్తత పాటించారు. అమెరికాపై నిందలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Last Updated : Jun 27, 2023, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.