ETV Bharat / international

నేపాల్​కు కొత్త ప్రధాని.. 'ప్రచండ' ప్రమాణస్వీకారం.. మూడోసారి బాధ్యతలు

నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో.. మూడోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.

nepal-new-prime-minister
nepal-new-prime-minister
author img

By

Published : Dec 26, 2022, 5:08 PM IST

Updated : Dec 26, 2022, 5:45 PM IST

నేపాల్​ నూతన ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేసిన ప్రచండ.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి అధికారిక నివాసమైన శీతల్ నివాస్​లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

nepal-new-prime-minister
ప్రచండతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న నేపాల్ రాష్ట్రపతి బిద్యా దేవి భండారి

ప్రధాని పదవిని పంచుకునే విషయంలో ఏర్పడ్డ అభిప్రాయభేదాల కారణంగా పాత కూటమికి గుడ్​బై చెప్పారు ప్రచండ. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు పార్టీల అధికార కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రధాని పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్నికలకు ముందు తాజా మాజీ ప్రధాని దేవ్​బా, ప్రచండ అంగీకరించుకున్నారు. అయితే, తొలి రెండున్నరేళ్లు ప్రధాని పదవి తనకు అప్పగించాలని ప్రచండ చేసిన ప్రతిపాదనను దేవ్​బా తిరస్కరించగా.. ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఫలితంగా విపక్షంలో ఉన్న తన పాత మిత్రుడు, మాజీ ప్రధాని ఓలిని సంప్రదించి.. మద్దతు కోరారు ప్రచండ. ఇందుకు ఓలి సుముఖంగా స్పందించగా.. 169 మంది చట్టసభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారమే ప్రచండను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

nepal-new-prime-minister
రాష్ట్రపతితో ప్రచండ (ఆదివారం నాటి చిత్రం)
nepal-new-prime-minister
ఆదివారం రాష్ట్రపతిని కలిసిన ప్రచండ

1954 డిసెంబర్ 11న కాక్సీ జిల్లాలోని దికుర్పోఖరి ప్రాంతంలో జన్మించిన ప్రచండ.. గెరిల్లా ఉద్యమ నేతగా ప్రాచుర్యంలోకి వచ్చారు. 1996 నుంచి 2006 వరకు రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. నేపాల్​లో 237ఏళ్ల పాటు కొనసాగిన రాచరికానికి చరమగీతం పాడటంలో విజయం సాధించారు. అనంతరం నేపాల్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సాయుధ పోరాటం చేస్తూ 13ఏళ్ల పాటు అండర్​గ్రౌండ్​లో బతికిన ఆయన.. సీపీఎన్-మావోయిస్టు పార్టీ శాంతియుత రాజకీయాలు ప్రారంభించిన అనంతరం.. ప్రధాన రాజకీయాల్లోకి వచ్చారు.

Last Updated : Dec 26, 2022, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.