ETV Bharat / international

Prigozhin Death US Intelligence : 'ప్రిగోజిన్​ది ఉద్దేశపూర్వక హత్యే.. క్షిపణితో విమానం కూల్చివేత!' - ప్రిగోజిన్ హత్య అమెరియా నిఘా విభాగం

Prigozhin Death US Intelligence Report : ప్రైవేటు మిలిటరీ సైన్యం వాగ్నర్ గ్రూప్​ చీఫ్​ ప్రిగోజిన్​ మరణంపై అమెరికా నిఘా వర్గాలు స్పందించాయి. ప్రిగోజిన్ ఉద్దేశపూర్వక హత్యేనని అంచనా వేశాయి. మరోవైపు, విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు సంతాపం తెలిపారు.

Prigozhin Death US Intelligence
Prigozhin Death US Intelligence
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 6:54 AM IST

Updated : Aug 25, 2023, 1:23 PM IST

Prigozhin Death US Intelligence Report : వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ను ఉద్దేశపూర్వక పేలుడుతోనే హత్యచేశారని అమెరికా నిఘావర్గాలు అంచనా వేశాయి. తన వ్యతిరేకుల నోరు మూయించే చరిత్ర ఉన్న పుతిన్‌ వైఖరి వల్లే ప్రిగోజిన్‌ విమానంలో పేలుడు జరిగిందని భావిస్తున్నట్లు.. పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి వెల్లడించారు. సాధారణంగా ప్రత్యర్థులకు దాడిచేసే అవకాశం ఇవ్వని ప్రిగోజిన్‌.. తనతో పాటు తన తర్వాత స్థాయిలో ఉండే లెఫ్టినెంట్స్‌ను కూడా వెంట తీసుకుని వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వాగ్నర్‌ గ్రూపు.. రష్యాపై తిరుగుబాటు చేసినందుకు పుతిన్‌ ప్రతీకారం తీర్చుకున్నారనే విమర్శలు రష్యాలో వినిపిస్తున్నాయి.

మరోవైపు, వాగ్నర్ గ్రూప్ అనుకూల వార్తా ఛానెళ్లలో ప్రిగోజిన్ హత్యపై పలు కథనాలు ప్రసారమయ్యాయి. ప్రిగోజిన్​ది హత్యేనని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. క్షిపణిని ప్రయోగించి ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేశారని అన్నారు. విమానం రాయిలా కిందపడుతున్న దృశ్యాలను విడుదల చేశారు. అయితే, వీరి ఆరోపణలు నిర్ధరణ కాలేదు.

  • Before anyone will proceed with officially-stated lies that "a bomb exploded on the aircraft" or that "some other form of sabotage" happened on Prigozhin's plane, have a look at THIS. Does it look like a "bomb" to you? pic.twitter.com/d4rNvW1UZf

    — Kremona (@Nowhere_near_O) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Prigozhin Death Putin Speech : ఇదేసమయంలో విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్‌ ఎన్నో తప్పులు చేసినప్పటికీ.. ఎంతో ప్రతిభ గల వ్యక్తి, వ్యాపారి అని పుతిన్‌ పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు.. కొంచెం సమయం పడుతుందన్నారు. ప్రిగోజిన్‌, ఇతర వాగ్నర్‌ గ్రూప్‌ సభ్యులు ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరులో.. ప్రముఖ పాత్ర పోషించారని పుతిన్‌ చెప్పారు. వారి సహాయాన్ని మర్చిపోలేమన్నారు.

రష్యా మీడియా కవరేజీ..
Russian Media On Prigozhin Death : వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ వార్తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు విస్తృత కవరేజీ ఇచ్చాయి. కానీ రష్యా మీడియా మాత్రం అంతగా స్పందించలేదు. రష్యా జాతీయ మీడియా సంస్థలైన రష్యా 24, రష్యా 1 టీవీ ఛానెళ్లు.. విమాన ప్రమాదం దర్యాప్తు గురించి మాత్రమే వివరించాయి. దీంతో పాటు దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్​ దేశాల శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్​గా పుతిన్ పాల్గొనడంపై కూడా విస్తృతమైన కవరేజీ ఇచ్చాయి.

'విమానంలో ఏ సాంకేతిక లోపం లేదు'
Prigozhin Plane Crash : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి ఆపై వెనక్కి తగ్గిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌ (62) బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. వాగ్నర్ గ్రూపు కీలక సభ్యులతో బుధవారం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన ఎంబ్రాయర్‌ జెట్‌ విమానం ఆకస్మికంగా ఆ విమానం కుప్పకూలింది. అయితే ప్రమాదానికి 30 సెకన్ల ముందు వరకూ ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌తోసహా వాగ్నర్‌ గ్రూపు కీలక కమాండర్లు మృతి చెందారు. ప్రమాద స్థలిలో సహాయక సిబ్బంది 10 మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిలో ప్రిగోజిన్‌సహా ఏడుగురు వాగ్నర్‌ గ్రూపు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వాగ్నర్‌ గ్రూప్‌ సెకండ్‌-ఇన్‌ కమాండ్‌ దిమిత్రి ఉత్కిన్‌ ఈ ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రిగోజిన్‌ మృతితో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నర్‌ గ్రూపు ప్రధాన కార్యాలయంలో శిలువ ఆకారంలో దీపాలను వెలిగించారు. గురువారం మధ్యాహ్నం కార్యాలయంవద్ద పుష్పాలను ఉంచారు.

తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్‌తో పుతిన్‌ భేటీ!.. డీల్​ అప్పుడే కుదిరిందా?

రష్యాలోనే ప్రిగోజిన్​.. 'వాగ్నర్‌' గ్రూప్‌ చీఫ్‌ ఇంటిపై దాడులు.. భారీగా బంగారం స్వాధీనం!

Last Updated : Aug 25, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.