ETV Bharat / international

మళ్లీ మోదీనే నంబర్​ వన్​, ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్ - ప్రధాని మోదీ గ్లోబల్ రేటింగ్

Modi best pm in the world భారత ప్రధాని నరేంద్ర మోదీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజామోదం ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది.

morning consult survey
మార్నింగ్ కన్సల్ట్ సర్వే
author img

By

Published : Aug 26, 2022, 5:22 PM IST

Modi best leader in the world : పాలనలో ప్రపంచ దేశాధినేతలను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ ' అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్​తో 5వ స్థానంలో నిలిచారు.

63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉన్నారు.

అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్‌' పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది.

ఇవీ చదవండి: ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ, రిటైర్మెంట్​ రోజున కీలక వ్యాఖ్యలు

ఆజాద్​ రాజీనామా దురదృష్టకరమన్న కాంగ్రెస్, భాజపా వెల్​కమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.