ETV Bharat / international

మోదీ- పుతిన్​ ఫోన్​ కాల్​.. ఉక్రెయిన్​తో యుద్ధం ముగింపుపైనే ప్రధాన చర్చ! - ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు చర్చలు న్యూస్

పుతిన్‌-మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్​తో యుద్ధానికి ముగింపునకు దౌత్యమే ఏకైక మార్గమని రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఈ సంభాషణలో మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపాయి.

pm Modi and Putin talked about Ukraine on the phone
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు ఫుతిన్
author img

By

Published : Dec 16, 2022, 5:29 PM IST

Updated : Dec 16, 2022, 5:37 PM IST

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. పుతిన్‌-మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాధినేతలు.. ఇంధనం, రక్షణ, భద్రత,వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారని వివరించాయి. ఇతర కీలక రంగాల్లో పరస్పర సంబంధాల బలోపేతంపైనా.. నేతలు చర్చలు జరిపారు. భారత్‌ అధ్యక్షతన జరగనున్న జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మోదీ.. పుతిన్‌కు వివరించారు.

రెండు దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని ఎదురు చూస్తున్నారని ఓ అధికారి తెలిపారు. భారత్‌-రష్యాల మధ్య సంబంధాలు బలోపేతానికి నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని వెల్లడించారు. ఈ ఏడాది జరిగే భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ రష్యాకు వెళ్లడం లేదని తెలిసిన తర్వాత ఈ ఫోన్‌ సంభాషణ జరిగింది.

Last Updated : Dec 16, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.