ETV Bharat / international

నేపాల్​లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి.. భారత్​ను తాకిన ప్రభావం! - నేపాల్ భూకంపం

Nepal Earthquake : నేపాల్​లో భారీ భూకంపానికి ఆరుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.6గా నమోదైంది. భూకంప ప్రభావం భారత్​ను సైతం తాకింది. రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

nepal earthquake
nepal earthquake
author img

By

Published : Nov 9, 2022, 7:26 AM IST

Updated : Nov 9, 2022, 2:22 PM IST

Nepal Earthquake : రిక్టర్ స్కేల్​పై 6.3 తీవ్రతతో నమోదైన భూకంపం నేపాల్‌ను వణికించింది. నేపాల్​లోని దీపయాల్​కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దోతి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించిందని అధికారులు తెలిపారు. నేపాల్‌ ఆర్మీ సహాయ చర్యల్లో పాల్గొంటోంది. నేపాల్​లో ఒక్కరోజు వ్యవధిలో రెండు ప్రకంపనలు, మూడు భూకంపాలు, అనంతర ప్రకంపనలు ఒకటి సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Nepal Earthquake
నేలమట్టమైన ఇళ్లు
nepal earthquake
నేపాల్​లో భూకంప తీవ్రత

భారత్​ను తాకిన భూకంప ప్రభావం
నేపాల్ భూకంప ప్రభావంతో దిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాలైన గాజియాబాద్, గురుగ్రామ్, లఖ్​నవూ.. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ సహా పలుప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు రావటం వల్ల భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. దిల్లీలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక 20 సెకన్లపాటు ప్రకంపనలు రాగా.. రిక్టరు స్కేలుపై 1.6 తీవ్రత నమోదైంది. ఉత్తరాఖండ్​లోని పితోర్​గఢ్​కు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో రాత్రి 1.57 గంటలకు భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల 27 నిమిషాలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొంది.

Nepal Earthquake
సహాయక చర్యల్లో స్థానికులు
Nepal Earthquake
సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ

ఇవీ చదవండి: 'రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వెనక్కి తగ్గం'.. తేల్చి చెప్పిన జైశంకర్

'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

Last Updated : Nov 9, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.