ETV Bharat / international

'చంద్రుడు చుట్టూ తిరిగొచ్చే వ్యోమగాములు వీరే.. ఆ ఇద్దరూ ప్రత్యేకం'.. నాసా ప్రకటన

చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది చివర్లో చంద్రుని చుట్టూ తిరిగి వచ్చే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. తొలిసారి ఓ మహిళతోపాటు నల్లజాతి వ్యక్తికి ఈ బృందంలో చోటు కల్పించారు. అమెరికాయేతర వ్యక్తి చంద్రుని వద్దకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి కావడం మరో విశేషం. 50 ఏళ్ల తర్వాత చంద్రుని మీద కాలు మోపేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని నాసా ప్రకటించింది.

nasa artemis astronauts
nasa artemis astronauts
author img

By

Published : Apr 4, 2023, 1:59 PM IST

వచ్చే ఏడాది చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చే నలుగురు వ్యోమగాముల పేర్లను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా ప్రకటించింది. ఇందులో ముగ్గురు అమెరికన్లు కాగా.. మరొకరు కెనడాకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తొలిసారి ఓ మహిళను, ఓ ఆఫ్రికన్ అమెరికన్‌ను పంపనున్నట్లు నాసా స్పష్టంచేసింది. గత 50 ఏళ్లలో తొలిసారి వీరు చంద్రుని సమీపంలోకి వెళ్లనున్నట్లు వెల్లడించింది. హ్యూస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో నాసా పరిపాలనా అధికారి బిల్‌ నెల్సన్.. నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు.

2024 చివర్లో ఈ నలుగురు వ్యోమగాములు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి.. ఒరాయన్‌ క్యాప్సూల్‌ ద్వారా చంద్రుడిని చుట్టి వస్తారని నాసా వెల్లడించింది. వీరిలో మిషన్ కమాండర్ రీడ్ వైస్ మ్యాన్, అఫ్రికన్ అమెరికన్ విక్టర్ గ్లోవర్‌తో పాటు.. సుorర్ఘమైన అంతరిక్షయానం చేసిన మహిళగా రికార్డు సృష్టించిన క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెర్మీ హన్ సెన్ ఉన్నారు. ఈ అంతరిక్షయానంలో వారు చంద్రుడిపై దిగడం గానీ.. కక్ష్యలోకి ప్రవేశించడం గానీ జరగదని నాసా అధికారులు స్పష్టంచేశారు. కేవలం చంద్రుడి చుట్టూ ఒరాయన్ కాప్య్సూల్‌లో చక్కర్లు కొట్టి.. తిరిగి భూమిని చేరుకుంటారని తెలిపారు. 2025లో ఆర్టిమెస్‌-3 మిషన్‌ ద్వారా వెళ్లే ఇద్దరు వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టనున్నారు.

nasa artemis astronauts
నాసా ప్రకటించిన నలుగురు వ్యోమగాములు

ఈ నలుగురు వ్యోమగాముల్లో వైస్‌మ్యాన్, గ్లోవర్, క్రిస్టినా కోచ్ ముగ్గురికీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన అనుభవం ఉందని నాసా తెలిపింది. ఈ నలుగురు వ్యోమగాముల వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంది. అమెరికా నుంచి కాకుండా ఇతర దేశస్థుడు చంద్రుని వద్దకు వెళ్లే బృందంలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. గతేడాది చివర్లో మానవరహిత ఒరాయన్‌ క్యాప్స్యూల్ చంద్రుడి వద్దకు వెళ్లి తిరిగి భూమికి చేరింది.

నాసా అంతరిక్ష వాహనాలు, అంతరిక్ష కేంద్రం కోసం కెనడాకు చెందిన అంతరిక్ష సంస్థ భారీ రోబోటిక్‌ పరికరాలను సమకూరుస్తున్నందున చంద్రుని వద్దకు వెళ్లే బృందంలో ఒక కెనడా వ్యోమగామికి చోటు కల్పించారు. ఈ ఆర్టెమిస్ ప్రయోగం కోసం నాసా 41 మంది వ్యోమగాములను ఎంపిక చేయగా.. అందులో నలుగురు కెనడాకు చెందిన వారున్నారు. చివరకు వారి నుంచి నలుగురిని తుది ఎంపిక చేశారు. 1968 నుంచి 1972 మధ్య అపోలో ద్వారా నాసా 24 మంది వ్యోమగాములను చంద్రుని వద్దకు పంపగా.. వారిలో 12 మంది జాబిల్లిపై అడుగుపెట్టారు. ఆర్టిమెస్‌-2 చంద్రయానం సజావుగా జరిగితే 2025లో చంద్రునిపై ఇద్దరు వ్యోమగాములను దించాలన్న నాసా లక్ష్యం నెరవేరుతుంది.

nasa artemis astronauts
నాసా ప్రకటించిన నలుగురు వ్యోమగాములు

చంద్రయానం చేయనున్న నలుగురు వ్యోమగాములు వారి కుటుంబాలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. భవిష్యత్‌ వ్యోమగాములకు ఈ ప్రయోగం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన ట్వీట్ చేశారు. కెనడా, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారి కలలు నిజం చేసుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.

nasa artemis astronauts
వ్యోమగాములతో నాసా బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.