ETV Bharat / international

45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు.. మిస్సింగ్​ కేసులో దారుణమైన ట్విస్ట్ - బ్యాగుల్లో మానవ శరీర భాగాలు జాలిస్కో మెక్సికో

Mexico Body Parts In Bags : ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో దారుణం వెలుగుచూసింది. దట్టమైన అడవిలోని ఓ లోయ ప్రాంతంలో 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు కనిపించడం కలకలం రేపింది. అందులో యువతీయువకుల శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన యువతీ యువకుల కేసు దర్యాప్తులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Mexico Body Parts In Bags
Mexico Body Parts In Bags
author img

By

Published : Jun 2, 2023, 4:58 PM IST

Mexico Body Parts In Bags : ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. జాలిస్కో రాష్ట్రంలో గాడలాజారా అనే పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని లోయలో అనుమానాస్పదంగా కొన్ని బ్యాగులను పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలించగా 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు కనిపించాయి. అవి మహిళ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మే 20న ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న దాదాపు 30 ఏళ్లు వయసున్న ఏడుగురు యువతీయువకులు అదృశ్యమయ్యారు. దీంతో వారి అదృశ్యంపై వివిధ రోజుల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు ఈ 45 బ్యాగులు దొరికాయి. అయితే అదృశ్యమైన యువతీయువకులు పనిచేస్తున్న కాల్ సెంటర్ సమీపంలో ఈ బ్యాగులు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ కాల్ సెంటర్​పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అంతకుముందు.. ఆ కాల్‌సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు లభ్యమైన బ్యాగుల దగ్గర డ్రగ్స్, రక్తపు మరకలు ఉన్న వస్తువులు, కొన్ని పత్రాలు కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆ శరీర భాగాలు ఎవరివనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Bags With Human Body Parts : లభ్యమైన ఆ 45 బ్యాగుల్లో ఎంత మంది శరీర భాగాలు ఉన్నాయో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి బ్యాగులు ఉంటాయనే అనుమానంతో హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్ హెలికాప్టర్లతో ఈ అన్వేషణ మరికొన్ని రోజులు కొనసాగుతుంది.

Mexico Jalisco Guadalajara : మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో మానవ శరీర భాగాలు ఇలా బ్యాగులలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో తోనాలా ప్రాంతంలో 70 సంచులలో మానవ అవశేషాలు కనిపించాయి. అప్పుడు వారు 11 మంది అని తేలింది. 2019లో కూడా 29 మంది వ్యక్తుల శరీర భాగాలు ఉన్న 119 బ్యాగులను పోలీసులు గుర్తించారు. 2018లో ముగ్గురు విద్యార్థుల శరీర భాగాలను యాసిడ్‌లో కరిగించిన విషయం మెక్సికోలో సంచలనం సృష్టించింది. దీనిపై నిరసనలు కూడా పెత్త ఎత్తున జరిగాయి. మెక్సికోలో వేలాది మిస్సింగ్ కేసులకు డ్రగ్ మాఫియానే కారణమని అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.