ETV Bharat / international

లాటరీలో రూ.10 వేల కోట్లు జాక్​పాట్.. పన్ను కట్టిన తర్వాత మిగిలేది అంతేనా?

మెగా మిలియన్స్​ జాక్​పాట్​లో సుమారు రూ.10 వేల కోట్లు గెలుచుకున్నాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. అయితే మొత్తం సొమ్ముకు అతడికి అందుతుందా? ఏమైనా పన్నులు చెల్లించాలా? చివరకు అతడి చేతికి ఎంత దక్కనుంది? వంటి విషయాలు తెలుసుకుందాం..

mega-millions-jackpot-now-135-billion-heres-tax-bill-if-you-win

author img

By

Published : Jan 15, 2023, 3:01 PM IST

నలభై ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతున్న మెగా మిలియన్స్​ జాక్​పాట్​.. 2023 ఏడాదిలో తొలి లాటరీ నిర్వహించింది. అందులో మైనే స్టేట్​లోని లెబనాన్​కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్​ జాక్​పాట్​లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. జనవరి 13న మెగా మిలియన్​ జాక్​పాట్​ తీసిన డ్రాలో విన్నింగ్​ టికెట్​ సంఖ్యతో అతడి టిక్కెట్​లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగామిలియన్స్​ జాక్​పాట్. ఇది తెలుసుకున్న నెటిజన్లు అతడికి మొత్తం సొమ్ము అందుతుందా? అతడేమైనా పన్నులు చెల్లించాలా? అని తెగ వెతికేస్తున్నారు.

విజేతకు మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.7వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్​​ ట్యాక్స్​ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత అతడికి వచ్చిన సొమ్ము సుమారు రూ.5వేల కోట్లుగా మారనుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్​ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్​ కట్టాలి. రాష్ట్రాన్ని బట్టి అది 0-10 శాతం ఉండొచ్చు. ఈ లెక్కన అతడికి సుమారు రూ. 3వేల కోట్లు అందుతాయి.

అమెరికాలో 10 అతిపెద్ద లాటరీ జాక్‌పాట్‌లు..

లాటరీ తేదీవిన్నర్​ ప్రదేశంగెలుచుకున్న మొత్తం (సుమారుగా)
నవంబరు 2022కాలిఫోర్నియారూ.16 వేల కోట్లు
అక్టోబరు 2018దక్షిణ కరోలినారూ.12 వేల కోట్లు
జనవరి 2016కాలిఫోర్నియా-ఫ్లోరిడారూ.12 వేల కోట్లు
జనవరి 2023మైనేరూ.10 వేల కోట్లు
జులై 2022ఇలినోయిస్​రూ.9.8 వేల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.