ETV Bharat / international

Libya Floods 2023 Death Toll : ఒకే సిటీలో 11,300 మృతి.. మరో 10,100 మిస్సింగ్​.. కొట్టుకొస్తున్న మృతదేహాలు.. - లిబియా వరదలు వార్తలు

Libya Floods 2023 Death Toll : డేనియల్ తుపాను ధాటికి డెర్నాలో 11,300 మంది మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. మరో 10,100 మంది ఆచూకీ దొరక్కట్లేదని వెల్లడించారు. వేలాది మంది సముద్రంలోకి కొట్టుకుపోగా.. వారి మృతదేహాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి.

libya-floods-2023-death-toll-libya-floods-update

author img

By PTI

Published : Sep 15, 2023, 6:44 AM IST

Updated : Sep 15, 2023, 7:19 AM IST

Libya Floods 2023 Death Toll : ఆఫ్రికా దేశం లిబియాలోని డెర్నా నగరంలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంలో 11,300 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రెడ్ క్రెసెంట్ గురువారం వెల్లడించింది. మరో 10,100 మంది ఆచూకీ దొరకడంలేదని తెలిపింది. వరదనీటి ఉద్ధృతికి రెండు డ్యామ్‌లు బద్దలవడమే ఈ భారీస్థాయి ప్రాణనష్టానికి కారణమైంది. ఈ వరద వేలాది మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. ఇప్పుడా మృతదేహాలు తిరిగి తీరానికి కొట్టుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో సముద్ర తీరం శవాల కుప్పగా మారిందని వెల్లడించారు. ఈ విపత్తులో చాలా వరకు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడం వల్ల ఇతర నగరాల్లోని మార్చురీలకు తరలిస్తున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలను సామూహిక ఖననం చేస్తున్నారు.

విదేశాల నుంచి సహాయక బృందాలు..
వరద ప్రభావం ఎక్కువగా ఉన్న డెర్నా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తుర్కియే, యూఏఈ, ఈజిప్టు, ట్యునీషియా, ఖతార్‌ నుంచి సహాయక బృందాలు వెళ్లాయి. వరద కారణంగా రహదారులు కొట్టుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రోజుల తరబడి మృతదేహాలు నీటిలోనే ఉండటం వల్ల అంటు వ్యాధుల ప్రబలే ముప్పు పొంచి ఉందని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం..
Libya Floods Derna : ఘటనలో అనేక నగరాలు వరద ప్రభావానికి గురయ్యాయి. డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగింది. సముద్ర తీరంలోని పర్వత ప్రాంతంలో ఈ డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలన్నీ చాలా వరకు పర్వత లోయలోనే ఉన్నాయి. దీని సమీపంలోని ఒక డ్యామ్‌ బద్దలు కావడం వల్ల ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీ బురద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రజలు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో వీధుల్లో మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. రెండు డ్యామ్​లు బద్దలు కావడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Libya Dam Collapse : కొట్టుకొస్తున్న వేలాది శవాలు.. లిబియా జలప్రళయానికి 20వేల మంది బలి!

Libya Floods Death Toll : రోడ్లపై గుట్టలుగా మృతదేహాలు!.. లిబియాలో వరదల బీభత్సం.. 5,300కు చేరిన మృతుల సంఖ్య

Last Updated : Sep 15, 2023, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.