ETV Bharat / international

రష్యానే 'డర్టీబాంబ్‌' ప్రయోగానికి సిద్ధమవుతోంది: జెలెన్​స్కీ - ఉక్రెయిన్​పై రష్యా అణుదాడి

ఉక్రెయిన్​ 'డర్టీబాంబ్' ప్రయోగానికి సిద్ధమవుతోందంటూ రష్యా చేసిన ఆరోపణలను కీవ్ ఖండించింది. రష్యానే ఉక్రెయిన్​పై అటువంటి దాడికి ఏర్పాట్లు చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ​ అన్నారు. దక్షిణ ఉక్రెయిన్​లోని అతిపెద్ద ఆనకట్టను పేల్చివేస్తామని రష్యా బెదిరిస్తోందని తెలిపారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం
Russia Ukraine war
author img

By

Published : Oct 25, 2022, 6:36 AM IST

ఉక్రెయిన్‌ 'డర్టీబాంబ్‌' ప్రయోగానికి సిద్ధమవుతోందంటూ రష్యా చేసిన ఆరోపణలను కీవ్‌ ఖండించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ మాస్కో ఇటువంటి ఆరోపణలు చేసిందంటే.. అదే అటువంటి దాడికి ఏర్పాట్లు చేసుకొంటుందని అర్థమన్నారు. జపొరోజియా అణు ప్లాంట్‌ రేడియేషన్‌ విపత్తు చూపించి రష్యా ప్రపంచాన్ని భయపెడుతోందని ఆయన ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్​లోని అతిపెద్ద ఆనకట్టను పేల్చివేస్తామని రష్యా బెదిరిస్తోందని తెలిపారు. ఈ విషయంపై ప్రపంచం కఠినంగా స్పందించాలన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు కూడా లభించింది. ఉద్రిక్తతలు పెంచేందుకు రష్యా ఇటువంటి వాదనలు చేస్తోందని కొట్టిపారేసింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఆదివారం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో ఫోన్లో మాట్లాడుతూ 'ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు అటువంటి వాదనలు ఉపయోగించవద్దు' అని అన్నారు. అనంతరం రష్యా వాదనలను తిరస్కరిస్తూ యూకే, అమెరికా, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులు ప్రకటన చేశారు.

రేడియో ధార్మికతతో రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించేందుకు ఉక్రెయిన్‌ సమాయత్తమవుతోందని ఆదివారం రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు ఆరోపించారు. దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సేనలు మున్ముందుకు చొచ్చుకువస్తున్న నేపథ్యంలో ఆయన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, తుర్కియే దేశాల రక్షణ మంత్రులతో ఫోన్లో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.

ఇవీ చదవండి: ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం.. పడవలో మంటలు చెలరేగి 14 మంది మృతి

'ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు శాయశక్తులా కృషి చేస్తా'.. ప్రధానిగా ఎన్నికైన అనంతరం రిషి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.