ETV Bharat / international

హమాస్​తో యుద్ధం​- ఆ రెండు దేశాల ఫార్ములాకు ఇజ్రాయెల్ నో- అమెరికా, బ్రిటన్ ఎస్ - how are palestine and israel separated today

Israel Palestine War Update : ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి పశ్చిమ దేశాలు సూచిస్తున్న రెండు దేశాల ఫార్ములాను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ను దేశంగానే పరిగణించరన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్‌లో ఇజ్రాయెల్ రాయబారి ఒక వార్తా సంస్థకు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. రెండు దేశాల ఫార్ములాకు అమెరికా సహా పలు ఐరోపా దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

Israel Palestine War Update
Israel Palestine War Update
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 7:14 PM IST

Israel Palestine War Update : ఇజ్రాయెల్, గాజా యుద్ధంలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. సమస్య పరిష్కారానికి రెండు దేశాల సిద్ధాంతాన్ని పశ్చిమ దేశాలు మరోసారి లేవనెత్తాయి. ఐతే ఈ రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము అంగీకరిచబోమని బ్రిటన్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పడకుండా శాంతి ఎలా నెలకొంటుందని ప్రశ్నించగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పక్కన ఒక దేశంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనాను ఏర్పాటు చేయడమే ఈ రెండు దేశాలు సిద్ధాంతం. ఈ విధానానికి అమెరికా సహా పలు ఇజ్రాయెల్ అనుకూల దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

Israel Palestine War Update
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం

అయితే ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. రెండు దేశాల ఏర్పాటు ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న తమ దీర్ఘకాలిక విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గాజాలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఇది సరైనదని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా దేశమే లేదని ఎల్లప్పుడు చెప్పలేరని ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రెండు దేశాలు ఉండాలనేది అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాల వైఖరి అని స్పష్టం చేశారు.

Israel Palestine War Update
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం

మరోవైపు వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌లో మూడో రోజూ ఇజ్రాయెల్‌ సైనిక ఆపరేషన్‌ను కొనసాగించింది. డ్రోన్‌ దాడుల్లో ఇప్పటి వరకు 11 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ జెనిన్‌లో 500 మందికిపైగా పాలస్తీనియన్లను నిర్బంధించిందని పాలస్తీనియన్‌ ప్రిసనర్స్‌ క్లబ్ అనే ఎన్జీవో పేర్కొంది. అయితే నిర్బంధించిన వారిని ఐడీఎఫ్‌ బలగాలు తమ సైనిక స్థావరంలో విచారించి విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో హింసకు పాల్పడుతున్న అతివాద ఇజ్రాయెలీలను తమ దేశంలోకి అనుమతించబోమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా కూడా వెస్ట్‌ బ్యాంక్‌లో హింసకు పాల్పడుతున్న ఇజ్రాయెలీలు తమ దేశానికి రాకుండా నిషేధం విధించింది.

Israel Palestine War Update
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 19 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజాలో పౌరులు ప్రాణాలు కోల్పోకుండా కేవలం హమాస్‌ స్థావరాలపైనే దాడులు జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై ఇజ్రాయెల్ ప్రధానితో చర్చించేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ సిద్ధమయ్యారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 18 వేల 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైనికుల మరణాల సంఖ్య 115కి చేరింది.

18వేలు దాటిన గాజా మరణాలు- వైద్య వ్యవస్థ అస్తవ్యస్తం, దేశమంతా 11 ఆస్పత్రుల్లోనే సేవలు

ఉక్రెయిన్​తో యుద్ధం, పుతిన్​కే రష్యన్ల ఫుల్ సపోర్ట్- ఐదోసారీ ఆయనదే పీఠం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.