ETV Bharat / international

ఉదయం 5.30కే స్కూల్​ స్టార్ట్.. ప్రభుత్వం కొత్త ప్రయోగం.. రాకపోతే ఇబ్బందులే! - ఇండోనేసియా లేటెస్ట్ న్యూస్

ఉదయమే లేచి త్వరగా రెడీ అయిపోయి స్కూళ్లకు వెళ్లడమంటే మహా చిరాగ్గా అనిపిస్తుంది కొందరు విద్యార్థులకు. స్కూల్‌ డేస్ ఎప్పుడు అయిపోతాయ్‌రా బాబోయ్ అని ఎదురు చూస్తుంటారు. ఉదయం 9 గంటలకు స్కూల్ అంటేనే ఇలా ఉంటే.. ఇక తెల్లవారుజామున పాఠాలు మొదలైపోతే? ఏ సాకులూ చెప్పకుండా కచ్చితంగా స్కూల్‌కు ఆ టైమ్‌కే రావాలని ఆర్డర్‌ ఇస్తే..? ఇంకెంత ఇబ్బందిగా ఉంటుంది. మరి ఉదయం 5.30 గంటలకు స్కూల్ ప్రారంభమైపోతుంది అక్కడ. మరి ఆ ప్రదేశం ఏదో.. ఎక్కడ ఇంత ఉదయాన్నే స్కూల్ ప్రారంభమవుతుందో ఓ సారి తెలుసుకుందామా.

indonesia school time
ఇండోనేసియా స్కూల్ టైమింగ్స్
author img

By

Published : Mar 16, 2023, 12:20 PM IST

పాఠశాలలు సాధారణంగా ఉదయం 8 గంటలు దాటిన తర్వాత తెరుస్తారు. అప్పటికి విద్యార్థులు చక్కగా తయారై సైకిళ్లు, బస్సు మీద స్కూల్​కు వెళ్తుంటారు. అయితే ఇండోనేసియాలో మాత్రం ఉదయం 5.30 గంటలకే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ఉదయాన్నే స్కూల్​లు పెట్టడం సరికాదని అంటున్నారు. మరి ఇంతకీ ఇండోనేసియా ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదయాన్న స్కూళ్లు పెట్టిందో ఓ సారి తెలుసుకుందాం.

టెంగ్​పారా ప్రావిన్స్​లోని కుపాంగ్​లో 10 ఉన్నత పాఠశాలల్లో ఉదయం 5.30 గంటలకే స్కూళ్లను తెరుస్తోంది. 12వ తరగతి విద్యార్థులు ఈ సమయానికి స్కూల్​కు రావాలని కండీషన్ కూడా పెట్టారు అధికారులు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గవర్నర్ విక్టర్ లైస్కోడాట్ ప్రకటించిన ఈ పథకం పిల్లల క్రమశిక్షణను మెరుగుపరుస్తుందని అధికారులు చెబుతున్నారు.

పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సరికి బాగా అలసిపోతున్నారు. ఇంత ఉదయాన స్కూల్​కు వెళ్లడం చాలా కష్టం. చీకటిగా ఉన్నప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించను. విద్యార్థుల భద్రతకు హామీ ఏంటి? అంత ఉదయం వేళ వారి ఇబ్బందులు పడుతున్నారు. 16 ఏళ్ల నా కుమార్తె ఉదయం 4 గంటలకు బైక్​పై స్కూల్​కు వెళ్తోంది. ఇంటికి వచ్చేసరికి అలసిపోతుంది. వెంటనే నిద్రపోతుంది.

--విద్యార్థిని తల్లి

విద్యా నాణ్యత, ప్రమాణాలను మెరుగుపరిచేందుకు.. ఉదయాన్నే స్కూల్ పెట్టడానికి ఎటువంటి సంబంధం లేదని విద్యా రంగ నిపుణుడు మార్కెల్ రోబోట్ అన్నారు. దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే నిద్రలేమితో విద్యార్థులు బాధపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు వారి ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. అలాగే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆయన వివరించారు. 'ఉదయం 5.30 గంటలకు స్కూల్ పెట్టడం వల్ల విద్యార్థులకు నిద్ర సరిపోదు. దీంతో వారు నిద్రలేమితో బాధపడే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యం పాలవుతారు. అలాగే విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు.' అని మార్కెల్​ రోబోట్ చెప్పారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలంటే ఎన్నో మార్గాలున్నాయని, ఇది మాత్రం సరైంది కాదని అంటున్నారు అక్కడి నిపుణులు. నిద్ర లేకపోవడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. గతంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీటియాట్రిక్స్ కీలక సూచనలు చేసింది. స్కూల్ టైమింగ్స్ ఉదయం 8.30 గంటల తర్వాత ఉంటేనే విద్యార్థులకు సరిపడా నిద్ర ఉంటుందని పేర్కొంది. లేకపోతే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.
సాధారణంగా ఇండోనేసియాలోని పాఠశాలలు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.