ETV Bharat / international

చైనా నిఘా నౌక ఎఫెక్ట్‌.. భారత క్షిపణి పరీక్ష వాయిదా?

హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా యుద్ధ నౌక వల్ల భారత క్షిపణి పరీక్ష వాయిదా పడే పరిస్థితి నెలకొంది. భారత ఆయుధ పాటవాలపై నిఘా ఉంచాలనే డ్రాగన్‌ ఈ నౌకను హిందూ మహా సముద్రంలో మోహరించిందన్న వార్తలు వస్తున్న వేళ భారత్‌ క్షిపణి పరీక్షను వాయిదా వేయనున్నట్లు సమాచారం.

china spy ship in india
china spy ship
author img

By

Published : Nov 5, 2022, 4:04 PM IST

భారత్‌ కీలక క్షిపణి ప్రయోగం చేపట్టడానికి కొద్ది రోజుల ముందు చైనాకు చెందిన ఓ నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించడం ఆందోళనకరంగా మారింది. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘా నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం వెల్లడించింది. ఈ నిఘా నౌక కారణంగా భారత కీలక క్షిపణి ప్రయోగం వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

నవంబరు 10 లేదా 11 తేదీల్లో దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత్‌ ఇటీవల నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ను జారీ చేసింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి పయనం శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే ఈ నోటీసు జారీ చేసిన కొద్ది రోజులకే చైనాకు చెందిన యువాన్‌ వాంగ్‌-6 అనే నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది. ఈ నౌక ఇండోనేషియా బాలీ తీరం నుంచి బయల్దేరింది.

యువాన్‌ వాంగ్‌-6 నౌక పరిశోధనా నౌక అని డ్రాగన్‌ చెబుతున్నప్పటికీ దీనికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను చైనా హిందూ మహా సముద్రంలోకి పంపించడంతో.. భారత ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్‌ ఈ చర్య చేపట్టి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. చైనా నౌక కదలిలకను సునిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఓ మిషన్‌ నిర్విరామంగా పనిచేస్తున్నట్లు తెలిపాయి.

ఈ ఏడాది ఆగస్టులోనూ చైనా నౌకాదళానికి చెందిన నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నౌకపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. లంక ప్రభుత్వం దాన్ని అనుమతించింది. ఆగస్టు 16-22 వరకు ఈ నౌక హంబన్‌టోట రేవులో ఆగింది. రుణాలను తిగిరి చెల్లించలేకపోవడంతో ఈ రేవును శ్రీలంక.. చైనాకు 99ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. దీంతో దాన్ని డ్రాగన్ సైనికావసరాలకు ఉపయోగించే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: భూమిపై పడనున్న 23 టన్నుల రాకెట్ శిథిలాలు.. ప్రమాదమెంత?

వైరల్ అవుతోన్న ఇప్పటంలోని పవన్ కళ్యాణ్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.