ETV Bharat / international

'నా మామ, భార్య జోలికొస్తే..'.. వారికి రిషి స్ట్రాంగ్ కౌంటర్! - బ్రిటన్​ ప్రధాని మంత్రి ఎన్నికలు

Rishi Sunak: బ్రిటన్​ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న భారత మూలాలున్న రిషి సునాక్​.. తన అత్తమామలైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి సాధించిన ఘనత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని స్పష్టం చేశారు. తన మామ, భార్యపై వచ్చే తప్పుడు వార్తలను తిప్పికొట్టారు. 20 కోట్ల రూపాయల పన్ను తప్పించుకునే వీలున్నా.. తన భార్య స్పచ్ఛందంగా వదులుకున్నారని సునాక్‌ తెలిపారు.

Rishi Sunak:
Rishi Sunak:
author img

By

Published : Jul 18, 2022, 5:47 PM IST

Rishi Sunak: బ్రిటన్​ ప్రధాన మంత్రి రేసులో భారత సంతతికి చెందిన ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్​ దూసుకుపోతున్నారు. ఇది వరకు జరిగిన రెండు రౌండ్ల ఓటింగ్​లో పైచేయి సాధించిన ఆయన.. అత్యధిక ఎంపీల మద్దతుతో తదుపరి రౌండ్​కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్​.. ఆదివారం ఓ వాడీవేడి డిబేట్​లో పాల్గొన్నారు. బ్రిటన్‌లో వేలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఇన్ఫోసిస్‌ కూడా ఒకటని గుర్తు చేశారు. తన భార్యపై, అత్తమామలపై వచ్చిన తప్పుడు వార్తలను తిప్పికొట్టారు. తన అత్తమామలైన నారాయణ మూర్తి, సుధా మూర్తి సాధించిన ఘనత పట్ల తాను ఎంతో గర్విస్తున్నట్లు తెలిపారు.

'ఆమె భర్త ఆస్తి కాదు.. నిర్ణయాలు గౌరవిస్తా'.. 2009లో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షతను రిషి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి అయ్యాక కూడా అక్షత బ్రిటిష్‌ పౌరసత్వం తీసుకోలేదు. దీనిపై విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు ఇదే ప్రశ్న ఓ వ్యక్తి.. సునాక్​ను డిబేట్​లో అడిగారు. 'నా భార్య నిర్ణయాలు, ఇష్టాలను నేను గౌరవిస్తాను. ఆమె భర్త ఆస్తి కాదు' అని దీటుగా సమాధానమిచ్చారు.

'పన్ను మినహాయింపును అక్షత స్వచ్ఛందంగా..' బ్రిటిష్​ పౌరసత్వం లేకపోవడం వల్ల అక్షత ఆదాయం, లాభాలపై పన్ను మినహాయింపు ఉండేది. దీనిపై విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగాయి. బ్రిటన్​లో అక్షత పన్నులు ఎగ్గొడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అక్షత పన్ను విషయాలపై సునాక్​ డిబేట్​లో ప్రశ్నలు ఎదుర్కొన్నారు. 'నా భార్య పన్ను మినహాయింపులను స్వచ్ఛందంగా వదులుకుంది. 20 కోట్ల రూపాయల పన్ను తప్పించుకునే వీలున్నా దాన్ని పక్కనపెట్టింది. కట్టాల్సిన పన్నులు కట్టింది. తప్పుడు వార్తలు ఇకనైనా అపండి' అంటూ సునాక్‌ స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చారు. బ్రిటన్‌లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఇన్ఫోసిస్‌ కూడా ఒకటని గుర్తు చేశారు.

Rishi Sunak:
ఇన్ఫోసిస్​ నారాయణమూర్తి దంపతులతో రిషి సునాక్​, అక్షత

'భగవద్గీతపై ప్రమాణం చేశాకే'.. రిషి సునాక్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను మర్చిపోలేదని చెప్పచ్చు. బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడిగా ఎన్నికైన సునాక్​ భగవద్గీతపై ప్రమాణం చేసిన తాను హిందూ మూలాలను ఎప్పటికీ మర్చిపోనని చాలాసార్లు ప్రకటించారు. తాను ఆచరణాత్మక హిందువునని ధైర్యంగా చెప్పేవారు. జనాభా లెక్కల సేకరణకు వచ్చిన అధికారులకు ఇచ్చిన పత్రంలోనూ బ్రిటిష్‌ ఇండియన్‌ కేటగిరీ మీద టిక్కు పెడతానని.. ఎలాంటి బెరుకు లేకుండా ప్రకటించారు.

'ఎప్పటికైనా ప్రధాని అవుతాననే అప్పుడే'.. అమెరికా రాజకీయ జీవితంలో మతం విస్తరించి ఉందని.. కానీ ఇంగ్లాండ్‌లో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. 95 శాతం శ్వేతజాతీయులు ఉన్న రిచ్మండ్‌ నుంచి తాను వరుసగా బ్రిటిష్‌ పార్లమెంటుకు ఎన్నిక కావడమే బ్రిటన్‌ వాసులు విశాల హృదయులు అనడానికి నిదర్శనమని రిషి సునాక్‌ ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే తాను ఎప్పటికైనా బ్రిటన్‌ ప్రధాని అవుతానని అప్పుడే చెప్పకనే ప్రజలు చెప్పారని అంటుంటారు.

'సునాక్​కే జై!'.. బ్రిటన్​లో తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషి సునాక్‌వైపు మొగ్గుచూపినట్లు తేలింది. ముఖ్యంగా రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికైతే ఓ 'మంచి ప్రధాని'గా ఉండగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు ఆదివారం వెల్లడైన ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ప్రస్తుతం కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడి పదవికి ఎన్నిక జరుగుతుండగా.. దానిలో గెలిచిన వ్యక్తే బ్రిటన్​ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇవీ చదవండి: బ్రిటన్ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తా.. వాటినే నమ్ముతాను: రిషి సునాక్

బ్రిటన్​ ఓటర్ల మద్దతు రిషి సునాక్​వైపే.. ఏకంగా 48 శాతంతో ముందంజ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.