ETV Bharat / international

Hamas Videos Israel Girl : బందీల వీడియో రిలీజ్.. ఇజ్రాయెల్​పై హమాస్ ఒత్తిడి! హెజ్​బొల్లా స్థావరాలు ధ్వంసం - ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

Hamas Videos Israel Girl : హమాస్‌ చెరలో బందీగా ఉన్న ఓ ఇజ్రాయెలీ మహిళకు సంబంధించి ఓ వీడియో తాజాగా బయటికొచ్చింది. చేతికైన తీవ్ర గాయంతో ఆమె బాధపడుతున్నట్లు ఆ వీడియోలో కన్పించింది. వీలైనంత త్వరగా తనను విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆ మహిళ వేడుకుంది. మరోవైపు, హెజ్​బొల్లా కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు నిర్వహించింది.

Hamas Videos Israel Girl
Hamas Videos Israel Girl
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 4:04 PM IST

Hamas Videos Israel Girl : ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి అనేక మందిని హతమార్చి, దాదాపు 200 మందిని బందీలుగా అపహరించిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ... ఓ మహిళా బందీకి సంబంధించిన వీడియో విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయెలీ మహిళ మియా షెమ్‌ చేతికి సర్జరీ జరగ్గా.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు.

Hamas Videos Israel Girl
యుద్ధ విధ్వంసం

Israel Hamas War News : తన పేరు మియా అని తమది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతమని ఆమె పేర్కొంది. అక్టోబరు 7న రీమ్‌ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లినట్లు తెలిపింది. అక్కడ నుంచే చాలా మంది బందీలను హమాస్‌ మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. ఆ సంగీత వేడుకపై హమాస్‌ మిలిటెంట్లు చేసిన దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. తన చేతికి తీవ్రగాయమైందని, గాజాలో తనకు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని మియా ఆ వీడియోలో పేర్కొంది. తనకు అక్కడ మందులు ఇస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా తనను ఇక్కడి నుంచి విడిపించాలని కోరింది. ఆమె ఎలా గాయపడిందో మాత్రం మియా ఆ వీడియోలో వివరించలేదు.

  • The girl in the video is called Maya Shem, she is 21 years old, she is from Shoam, a citizen of Israel and France.#Hamas released a video of her treatment pic.twitter.com/J0mgotCFoQ

    — Arthur Morgan (@ArthurM40330824) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మానవత్వం ఉన్నట్లు చెప్పుకునేందుకే అలా..'
Hamas Videos Telegram : ఈ వీడియోను హమాస్‌ మిలిటెంట్లు తమ సొంత టెలిగ్రామ్‌లో విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సంస్థ మద్దతుదారులు కొందరు ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి.. ఆమె హమాస్‌ చెరలో ఉన్నట్లు చెప్పామని తెలిపింది. తమను తాము మానవత్వం ఉన్న మనుషులుగా చిత్రీకరించుకునేందుకే హమాస్‌ ఈ వీడియోను విడుదల చేసిందని, కానీ అది ఓ భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని, అనేక మంది పసిబిడ్డలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులను అపహరించారని, పలువురిని హత్య చేశారని ఐడీఎఫ్ తెలిపింది. మియాతో పాటు హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఐడీఎఫ్‌ పేర్కొంది.

Hamas Videos Israel Girl
ఇజ్రాయెల్ సైనిక బలగాలు
Hamas Videos Israel Girl
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం

ఇటీవల బందీల పిల్లలను ఆడిస్తున్న వీడియోను కూడా హమాస్‌ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ మిలిటెంట్లు పాల్పడిన మారణహోమంతో హమాస్‌పై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. ఈ వీడియోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. హమాస్‌ చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హమాస్‌ నెట్‌వర్క్‌ను ఛేదించి.. బందీలను విడిపించేందుకు గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది.

Hamas Videos Israel Girl
మంటల్లో కాలిపోతున్న ఇల్లు
Hamas Videos Israel Girl
నింగిలో దూసుకెళ్తున్న రాకెట్లు

హెజ్​బొల్లాపై దాడులు
Hezbollah Israel Attack : మరోవైపు, హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ వాయుసేన విరుచుకుపడింది. ఆ సంస్థకు చెందిన కీలక స్థావరాలపై దాడులు నిర్వహించింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ.. రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉంది. గత కొన్నాళ్లుగా తరచూ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక హమాస్‌కు ఈ సంస్థ పూర్తి మద్దతును ప్రకటించి ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ సైనిక లక్ష్యాలపై కూడా తమ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన ట్వీట్‌ చేసింది.

Hamas Videos Israel Girl
దాడుల్లో ధ్వంసమైన ఇల్లు

Trump On Gaza Refugees : 'అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం.. సానుభూతిపరులకు నో ఎంట్రీ'

Hamas Secret Weapon : 'రహస్య ఆయుధం'తో హమాస్ దొంగదెబ్బ!.. ఇజ్రాయెల్​ను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్​! ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.