ETV Bharat / international

గయానా X వెనెజులా- చమురు నిక్షేపాల కోసం మరో యుద్ధం! - గయానా వెనెజులా వివాదం

Guyana Venezuela Conflict : దక్షిణ అమెరికా ఖండంలో చిన్న దేశం గయానా ఇప్పుడు ఈ చిన్న దేశం పెద్ద సమస్యలో చిక్కుకుంది. గయానాలోని సహజ వనరులపై కన్నేసిన వెనెజులా యుద్ధానికికాలు దువ్వుతోంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనెజులా చూపు చమురు ని‌ల్వలకు కేంద్రమైన గయానాలోని ఎసెక్విబో ప్రాంతంపై పడింది. దశాబ్దాలుగా ఆ ప్రాంతం తమదే అని వాదిస్తున్న వెనెజులా ఈ చమురు నిల్వలున్నాయన్న వార్తలతో ఇప్పుడు యుద్ధం చేసైనా దాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

Guyana Venezuela Conflict
Guyana Venezuela Conflict
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 8:27 PM IST

Guyana Venezuela Conflict : ఓ వైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. మరోవైపు గాజాలోని హమాస్‌ దళాలపై ఇజ్రాయెల్‌ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు మరో యుద్ధం అంటూ వస్తున్న వార్తలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం గయానాలోని ఎసెక్విబోలోని చమురు నిల్వలను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా వెనెజులా కదనానికి కాలు దువ్వుతోంది. ఎసెక్విబో ప్రాంతంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. 2015 నుంచి ఇక్కడ జరిపిన అన్వేషణలో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనెజులా ఈ చమురు నిల్వలపై కన్నేసింది. దశాబ్దాలుగా ఎసెక్విబో ప్రాంతం తమదేనని వాదిస్తున్న వెనెజులా ఎసెక్విబోను స్వాధీనం చేసుకునేందుకు సైనిక శక్తితో పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో అతి చిన్న దేశమైన గయాన తరపున అమెరికా రంగంలోకి దిగింది. గయానా సైన్యంతో కలిసి వెనెజులా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది.

గయానా-వెనెజులా మధ్య ఉన్న ఎసెక్విబో వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో వివాదాన్ని అక్కడే తేల్చుకోకుండా వెనెజులా సైనిక శక్తిని ప్రయోగిస్తుండడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వెనెజులా అధ‌్యక్షుడు నికోలస్ మదురో తమ దేశంలోనే ఓ రెఫరెండం నిర్వహించారు. ఎసెక్విబో తమదే అంటున్న ప్రభుత్వ వాదనపై ప్రజాభిప్రాయం కోరింది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటుచేయడంపై కూడా రెఫరెండాన్ని కోరారు. ప్రభుత్వ వాదనను సమర్ధించాలని దేశప్రజలను కోరారు. ఈ రెఫరెండంలో ప్రజల్లో 95 శాతం మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని వెనెజులా సర్కార్‌ ప్రకటించింది. ఈ రిఫరెండం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపుతూ కొత్త మ్యాపులను వెనెజులా ప్రభుత్వం విడుదల చేసింది.

ఎసెక్విబో ప్రాంతం వందేళ్లుగా గయానా అధీనంలోనే ఉంది. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ ప్రకటించడం వల్ల పదేళ్ల పాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోలో చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చమురు నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఎసెక్విబో తమదేనన్న వాదించడం ప్రారంభించారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. దట్టమైన అడవులతో ఉండే ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు మార్గం. లేదంటే బ్రెజిల్‌ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ కూడా వెనెజులాతో సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ సమస్యను శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో డిసెంబర్‌ 14న మదురోతో భేటీ అయ్యేందుకు గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ అంగీకరించారు.

భూటాన్​లో చైనా 'అక్రమ' గ్రామాలు- 191 భవనాల నిర్మాణం- డ్రాగన్ డబుల్ గేమ్​!

అంధకారంలో లంక, దేశమంతా కరెంట్​ బంద్​! మరో సమస్యలో ద్వీపదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.