ETV Bharat / international

అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్​ దళాలు- పసికందుల ప్రాణాలకు ముప్పు?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 10:45 PM IST

Gaza Hospital News : ఇజ్రాయెల్‌ దాడులతో ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. నెతన్యాహు దళాలు అక్కడి అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను చుట్టుముట్టాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసికందు సహా ఐదుగురు చనిపోయారు. మరికొందరు పసికందుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Gaza Hospital News
Gaza Hospital News

Gaza Hospital News : ఉత్తర గాజాలో భూతల దాడులను ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్ సేనలు.. అక్కడి అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను చుట్టుముట్టాయి. హాస్పిటల్‌ వద్ద హమాస్‌ మిలిటెంట్లతో ఐడీఎఫ్‌ తీవ్రంగా పోరాడుతోంది. బాంబులు, రాకెట్‌ దాడులతో అల్‌ షిఫా ఆస్పత్రి అంధకారంగా మారినట్లు వైద్యులు వెల్లడించారు. ఇంధనం లేక చివరి జనరేటర్‌ కూడా నిలిచిపోవడం వల్ల ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్పత్రి కిందే హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని, దాన్ని గుర్తించామని ఇజ్రాయెల్‌ సైన్యం ఇటీవల వెల్లడించింది. పౌరులను హమాస్‌ మానవ కవచాలుగా మార్చుకుందని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్ద దాడులను మరింత పెంచటం వల్ల ఆ ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న పౌరులు.. ప్రాణభయంతో వణికిపోతున్నారు.

అల్‌-షిఫా ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవని ఆస్పత్రి డైరెక్టర్‌ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా ఛానళ్లు వెల్లడించాయి. రోగులు, ముఖ్యంగా అత్యవసర విభాగంలో ఉన్నవారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇంధనం లేకపోవడం వల్ల చివరి జనరేటర్‌ కూడా పనిచేయడం ఆగిపోయిందని తెలిపాయి. పిల్లల అత్యవసర విభాగంలో 37మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పుడు వారిప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

అమెరికాపై ఇరాన్‌ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం రైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ సేనలు గాజాపై దాడులను తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పుడు మాటలు కాదని, చేతలు అవసరమని అమెరికాను ఉద్దేశించి అన్నారు. అమెరికా నిజస్వరూపాన్ని ప్రపంచం గమనిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించబోయే ఇస్లామిక్‌ దేశాల శిఖరాగ్ర సమావేశానికి బయలు దేరే ముందు టెహ్రాన్‌ విమానాశ్రయంలో సయ్యద్‌ రైసీ విలేకరులతో మాట్లాడారు. గాజా.. మాటలకు వేదిక కాకూడదని.. చేతలకు వేదికవ్వాలని ఆయన అన్నారు. గాజాపై దాడులు ఉద్ధృతమవుతున్న తరుణంలో ఇస్లామిక్‌ దేశాల ఐక్యత చాలా కీలకమని తెలిపారు.

"గాజాలో యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నందున వెంటనే దీనికో పరిష్కారం ఆలోచించాలని అమెరికా అంటోంది. ఇదే విషయాన్ని ఇరాన్‌ సహా ప్రపంచ దేశాలన్నింటికీ చెబుతోంది. కానీ, అమెరికా చర్యల్లో మాత్రం అది కనిపించడంలేదు. గాజాలో యుద్ధాన్ని నిలిపివేయాలా? కొనసాగించాలా? అన్నది అమెరికా చేతుల్లోనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాలో దాడులను కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం సాయం చేస్తోంది. అమెరికా నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి" అని రైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

యుద్ధానికి 4 గంటల విరామం- అమెరికా ప్రకటన, ఖండించిన ఇజ్రాయెల్​- హమాస్​కు భారత్ సందేశం

150 మంది ఉగ్రవాదులు హతం, హమాస్ స్థావరాలు ధ్వంసం- ఇజ్రాయెల్ గుప్పిట్లోకి గాజా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.