ETV Bharat / international

రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు, మొట్టమొదటిసారి ఆ మీటింగ్​లో - ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం

India Votes Against Russia ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా చేపడుతున్న యుద్ధం గురించి సమీక్షించడానికి ఐరాస భద్రతామండలి సమావేశమైంది. ఆ మీటింగ్​లో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ మొట్టమొదటిసారిగా ఓటు వేసింది.

For the first time, India votes against Russia in UNSC on Ukraine

author img

By

Published : Aug 26, 2022, 7:45 AM IST

India Votes Against Russia:మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. బుధవారం ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అక్కడ యుద్ధం గురించి సమీక్షించడానికి భద్రతామండలి సమావేశమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది.

15 సభ్యదేశాలున్న భద్రతామండలిని ఉద్దేశించి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మండలి కోరగా రష్యా అభ్యంతరం తెలిపింది. కొవిడ్‌ తీవ్రత తగ్గింది కాబట్టి జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా హాజరై ప్రసంగించాలని షరతు పెట్టింది. యుద్ధం కొనసాగుతున్నందు వల్ల జెలెన్‌స్కీ భద్రతామండలికి రాలేరని కొన్ని దేశాలు ఆయన్ని సమర్థించాయి. ప్రొసీజరల్‌ ఓటింగ్‌లో భారత్‌ సహా 13 సభ్యదేశాలు జెలెన్‌స్కీ వర్చువల్‌ ప్రసంగానికి అనుకూలంగా, రష్యా ఒక్కటే వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ ఓటింగ్‌లో చైనా పాల్గొనలేదు.

ఇవీ చదవండి: కరోనా, మంకీపాక్స్‌, హెచ్ఐవీ మూడూ ఒకేసారి, ఒకే వ్యక్తికి

అక్క రికార్డు బద్దలు, చిన్న వయసులోనే ప్రపంచాన్ని చుట్టొచ్చి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.