ETV Bharat / international

విషాదం.. కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి

author img

By

Published : Jul 20, 2023, 6:35 AM IST

Updated : Jul 20, 2023, 8:21 AM IST

Colombia Plane Crash : కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చిన్న విమానం కూలి ఐదుగురు రాజకీయ నాయకులు మరణించారు. చనిపోయిన వారికి ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Colombia Plane Crash
Colombia Plane Crash

Colombia Plane Crash : కొలంబియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌ సహా ఐదుగురు రాజకీయ నాయకులు దుర్మరణం పాలయ్యారు. వీరు కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ఆ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఆ దేశ సివిల్‌ ఎవియేషన్‌ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మృతిచెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

హ్యాంగర్​పైకి దూసుకెళ్లిన విమానం..
కొద్దిరోజుల క్రితం.. పోలండ్​లో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 'సెస్నా 208' అనే విమానం స్కైడైవింగ్ సెంటర్​లోని హ్యాంగర్​పైకి దూసుకెళ్లడం వల్ల ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

నోవీ డవార్ రాష్ట్రం, గిమినా నాసియెల్​స్క్ జిల్లాలోని క్రిసినో గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ప్లేన్ పైలట్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. వాతావరణం సరిగా లేదని హ్యాంగర్​లో తలదాచుకున్న నలుగురు సైతం ఈ ప్రమాదంలో చనిపోయారని చెప్పారు. ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి సైతం ఉందని గవర్నర్ సిల్వెస్టర్ డాబ్రోవ్స్కీ తెలిపారు.

నేపాల్ ప్రమాదంలో 70 మంది మృతి
కాగా ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్​వేపై ల్యాండ్ అవుతుండగా యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంజిన్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పాత విమానాశ్రయానికి.. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 72 ప్రయాణికుల్లో 15 మంది విదేశీయులు ఉన్నారు. అందులో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి. ఈ ఘటన లైవ్ వీడియో కోసం ఈ లింక్​ను క్లిక్ చేయండి.

Last Updated : Jul 20, 2023, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.