ETV Bharat / international

అగ్నిప్రమాదంలో 39 మంది మృతి.. అమెరికాలో స్థిరపడాలన్న ఆశతో వెళ్తూ.. - migrants mexico border

అమెరికాలో స్థిరపడాలన్న ఆశతో.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న 39 మంది దుర్మరణం పాలయ్యారు. మెక్సికోలోని ఓ శరణార్థుల కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వీరందరూ ప్రాణాలు కోల్పోయారు.

mexico fire news
mexico fire news
author img

By

Published : Mar 28, 2023, 4:07 PM IST

Updated : Mar 28, 2023, 7:22 PM IST

సొంత దేశంలో ఉండలేక.. అగ్రరాజ్యంలో ఆశ్రయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న 39 మంది అగ్నికీలలకు బలైపోయారు. మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 29 మంది గాయపడ్డారు. అయితే, శరణార్థులు పరుపులకు నిప్పంటించడమే కారణంగా తెలుస్తోంది. శరణార్థుల కేంద్రం నుంచి తమను బయటకు పంపిస్తున్నారనే విషయం తెలియడం వల్ల వలసదారులు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టారు. ఈక్రమంలోనే కేంద్రంలోని పరుపులకు నిప్పంటించగా.. మంటలు వ్యాపించి 39 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్​లోని శరణార్థుల కేంద్రంలో జరిగిందీ దుర్ఘటన. వేర్వేరు దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు.. అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది.. అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడి శరణార్థుల కేంద్రంలోనే ఉంటారు. అలాంటి చోట.. సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు దగ్గర్లోని 4 వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్​ కార్యాలయం దర్యాప్తునకు ఆదేశించింది.

mexico fire news
ప్రమాద స్థలంలో అంబులెన్సులు
mexico fire news
మృతదేహాలు
mexico fire news
ప్రమాద స్థలం
mexico fire news
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఫ్రిజ్​ గోదాంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
చైనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ మూతపడిన రిఫ్రిజరేటర్​ గోదాంలో మంటలు చెలరేగి.. 11 మంది మరణించారు. ఈ ప్రమాదం హెబెయ్​ ప్రావిన్స్​లో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆదివారం టునీషియాలో జరిగిన ఓ ప్రమాదంలో 29 మంది వలసదారులు మరణించారు. ఓ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోవడం వల్ల 29 మంది వలసదారులు మృతి చెందారు. మరో 67 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మందిని రక్షించినట్లు వారు చెప్పారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా ఆఫ్రికాకు చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు.

వలసదారుల పడవ మునిగి 59 మంది మృతి
ఇటీవలే ఇటలీలోని ఓ వలసదారుల పడవ మునిగి 59 మంది మరణించారు. అయోనియన్‌ సముద్ర తీరంలో శరణార్థుల పడవ ప్రమాదానికి గురై 59 మంది మృతి చెందారు. ఘటనా సమయంలో బోటులో 100 మందికిపైగా వలసదారులు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. మిగిలిన వారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో నెలలు నిండని శిశువు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బందితోపాటు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పడవలోని శరణార్థులు తుర్కియే, ఈజిప్టు నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఫిబ్రవరి 27న జరిగిందీ ప్రమాదం.

చిన్న పిల్లలు సహా 86 మంది..
గతేడాది సెప్టెంబర్​లో లెబనాన్‌ నుంచి సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తా పడిన ఘటనలో చిన్నపిల్లలు సహా 86 మంది మృతిచెందారు. మరణించిన వారంతా లెబనాన్‌, సిరియా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 150 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. మధ్యధరా సముద్ర తీరంలో జరిగిన అత్యంత దారుణమైన దుర్ఘటనల్లో ఇదొకటని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి : అమెరికాలో మహిళ హల్​చల్.. స్కూల్​లోకి చొరబడి కాల్పులు.. ఆరుగురు మృతి

హజ్ యాత్రలో విషాదం.. మక్కాకు వెళ్తుండగా బస్సులో మంటలు.. 20 మంది మృతి

Last Updated : Mar 28, 2023, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.