ETV Bharat / international

ఫైవ్​స్టార్​ హోటల్లో భారీ పేలుడు.. 25 మంది మృతి - హవానా హోటల్​

Explosion In Hotel: గ్యాస్ ​లీకేజీ కారణంగా క్యూబా రాజధాని హవానాలోని ఓ ఫైవ్​స్టార్​ హోటల్​లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 74 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారు.

Explosion In Hotel
Explosion In Hotel
author img

By

Published : May 7, 2022, 4:54 AM IST

Updated : May 7, 2022, 8:49 PM IST

Explosion In Hotel: క్యూబా రాజధాని హవానాలో 'సరటోగా' ఫైవ్​స్టార్​ హోటల్లో శుక్రవారం ఉదయం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 74 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 14 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చుట్టుపక్కల ఆసుపత్రులకు తరలించారు. ఈ భవనం పక్కన ఉన్న స్కూలును వెంటనే అధికారులు ఖాళీ చేయించారు.

శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్​ లీకేజీగా కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి హోటల్​ బయట ఉన్న బస్సులు, కార్లు కూడా ధ్వంసమయ్యాయి. 96 గదులు, రెండు రెస్టారెంట్లు ఉన్న ఈ హోటల్​ 1930లో నిర్మించారు.

ఇదీ చదవండి: మరింత ముదిరిన శ్రీలంక సంక్షోభం.. మరోసారి ఎమర్జెన్సీ

Last Updated : May 7, 2022, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.