ETV Bharat / international

'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి'.. ఎలాన్​ మస్క్​ తండ్రి కామెంట్స్​! - ఎరాల్​ మస్క్​ మూడో భార్య

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్(76) తనకు సంబంధించిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన 35 ఏళ్ల కూతురుతో (రెండో భార్య కుమార్తె) సహజీవనం చేసినట్లు, ఆమెతో ఓ బిడ్డను కూడా కన్నట్లు ఎరోల్ మస్క్ తాజాగా వెల్లడించారు. 'మనం భూమి మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి' అంటూ చెప్పుకొచ్చారు.

ఎలాన్‌ మస్క్‌ తండ్రి
ఎలాన్‌ మస్క్‌ తండ్రి
author img

By

Published : Jul 15, 2022, 5:50 PM IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల కవలలకు తండ్రైనట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయన తండ్రి ఎరాల్‌ మస్క్‌ మరోసారి తండ్రి అయ్యారనే రహస్యం తాజాగా బయటపడింది. అయితే, ఏడుపదుల ప్రాయంలో తండ్రి అయినప్పటికీ, జన్మనిచ్చిన మహిళ మాత్రం ఆయనకు వరుసకు కూతురు (రెండో భార్య కుమార్తె) కావడం సొంత కుటుంబీకులనే విస్మయానికి గురిచేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించిన ఎరాల్‌ మస్క్‌ (76).. 'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి' అంటూ చెప్పడం గమనార్హం.

దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాల్‌ మస్క్‌ ఓ ఇంజినీర్‌. ఆయనకు ఎలాన్‌ మస్క్‌ తల్లి మయే హల్దేమాన్‌తో 1979లో వివాహమయ్యింది. ఆ జంటకు మొత్తం ముగ్గురు పిల్లలు (ఎలాన్‌ మస్క్‌, కింబల్‌, టాస్కా). అయితే, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎరాల్‌ మస్క్‌ రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య హైడే బెజూడెన్‌హౌట్‌తో ఇద్దరు పిల్లలకు తండ్రికాగా.. హైడేకు అంతకుముందే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు జానా బెజూడెన్‌హౌట్‌ (35). ప్రస్తుతం ఆమె సవతి తండ్రి అయిన ఎరాల్‌ మస్క్‌తోనే కలిసి ఉంటున్నారు.

వరుసకు కూతురయ్యే మహిళతో సహజీవనం చేసిన ఎరాల్‌ మస్క్‌కు 2017లో తొలి సంతానం కలిగింది. అనంతరం 2019లో మరో పాపకు తండ్రి అయ్యారనే రహస్యం ఇటీవల బయటకు వచ్చింది. ఇది కాస్త మీడియాలో ప్రచారం కావడంతో ఎలాన్‌ మస్క్‌ తండ్రి స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇలా మొదటి భార్యకు ముగ్గురు (ఎలాన్‌ మస్క్‌తో కలిపి), రెండో భార్యకు ఇద్దరు కాగా.. రెండో భార్య కూతురితో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా తేలడంతో ఎరాల్‌ మస్క్‌కు మొత్తం ఏడుగురు సంతానం అయినట్లయ్యింది. మరోవైపు 51 ఏళ్ల ఎలాన్‌ మస్క్‌ కూడా మూడేళ్ల చిన్నారికి సోదరుడు అవడం విశేషం.

బెజూడెన్‌హౌట్‌ గర్భవతి అయ్యారనే విషయం తెలియగానే మస్క్‌ కుటుంబం మొత్తం షాక్‌కు గురైనట్లు సమాచారం. ఈ విషయం గురించి మాట్లాడిన ఎరాల్‌ మస్క్‌.. ఇప్పటికీ ఈ వ్యవహారంపై తమ కుటుంబీకులు అసంతృప్తిగానే ఉన్నారన్నారు. అయితే, ఎలాన్‌ మస్క్‌ ఇటీవల మరో ఇద్దరు పిల్లలకు తండ్రైనట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే ఆయన తండ్రికి చెందిన ఈ రహస్యం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆయనే మీడియా ముందు ఈ విస్తుపోయే విషయాన్ని ధ్రువీకరించడం కొసమెరుపు.

ఇవీ చదవండి: నాజీల అరాచకం.. అక్కడ 8,000 మంది అస్థికలు గుర్తింపు

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట విషాదం.. ట్రంప్​ మొదటి భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.