ETV Bharat / international

ఆ మీడియా సంస్థపై ట్రంప్ పరువు నష్టం దావా.. 7,700సార్లు అలా అందని... - సీఎన్​ఎన్​పై డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం కేసు

తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్​ఎన్​ చిత్రీకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి నుంచి 7వేల 700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

trump cnn defamation suit
ఆ మీడియా సంస్థపై ట్రంప్ పరువు నష్టం దావా.. 7,700సార్లు అలా అందని...
author img

By

Published : Oct 4, 2022, 10:07 AM IST

అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్​ఎన్​ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తన పరువుకు CNN నెట్‌వర్క్‌ భంగం కలిగించిందని, అందుకు 475 మిలియన్ డాలర్లు(సుమారు 3వేల900 కోట్ల రూపాయలుః పరిహారం కోరుతూ దావా వేశారు. ఈ మేరకు 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫు న్యాయవాదులు ఫ్లోరిడాలోని యూఎస్​ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సమర్పించారు.

తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్​ఎన్​ చిత్రీకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి నుంచి 7వేల 700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని భయపడి.. ఇటీవల తనపై సీఎన్​ఎన్​ దాడిని పెంచిందని ఆరోపించారు.
సీఎన్​ఎన్​పై ట్రంప్​ గతంలో అనేక సార్లు ఇలాంటి ఆరోపణలే చేశారు. తనకు వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో సీఎన్​ఎన్​ను పదేపదే "క్లింటన్ న్యూస్​ నెట్​వర్క్​"గా అభివర్ణించేవారు ట్రంప్. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్​కు అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా ఈ విమర్శలు చేసేవారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.