ETV Bharat / international

'మా అమ్మ అప్పుడే చనిపోలేదు.. అమెజాన్ అడవిలో 4 రోజులు కొన ఊపిరితో..' - colombia plane crash new details

Amazon Plane Crash Kids : అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో మహాద్భుతం జరిగి అమెజాన్‌ దండకారణ్యం నుంచి బయటపడ్డ నలుగురు చిన్నారులు.. కొలంబియాలోని సైనిక ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. నలభై రోజుల పాటు ప్రాణాలు నిలుపుకునేందుకు చిన్నారులు చేసిన ప్రయత్నాలు.. వారి ధైర్యానికి సలామ్‌ కొట్టేలా చేస్తున్నాయి. విమాన ప్రమాదం జరిగిన వెంటనే తమ తల్లి మరణించలేదని.. కొన ఊపిరితో నాలుగు రోజులు బతికిందని ఆ భయంకర ఘటనను చిన్నారులు గుర్తు చేసుకున్నారు. రెస్క్యూ టీం కనపడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన చిన్నారులు.. ఆకలిగా ఉందని అడగడం, అమ్మ చనిపోయిందని చెప్పడం, అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

colombia plane crash children
కొలంబియా విమానం ప్రమాదం 2023
author img

By

Published : Jun 12, 2023, 2:27 PM IST

Colombian Plane Crash Children : దట్టమైన అమెజాన్‌ అడవిలో తప్పిపోయి 40 రోజుల పాటు మనుగడ సాగించిన చిన్నారులు.. ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొలంబియాలోని సైనిక ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్న చిన్నారులు.. ఆ భయానక రోజులను బంధువులు, వైద్యులతో పంచుకుంటున్నారు. విమానం కూలిపోయిన తర్వాత ఆ చిన్నారుల తల్లి నాలుగు రోజల పాటు బతికే ఉందని.. పిల్లలు చెప్పారని బంధువులు తెలిపారు. విమాన ప్రమాదంలో చిన్నారుల తల్లి తీవ్రంగా గాయపడిందని.. నాలుగు రోజుల పాటు కొన ఊపిరితో ఉందని వివరించారు. మరణించే ముందు ఈ అడవిని దాటి బయటకు వెళ్లాలని పిల్లలకు చెప్పిందని రానోక్‌ వివరించారు. విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత.. తల్లి మరణంతో పిల్లలు అడవి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టారని వెల్లడించారు.

అమెజాన్‌ కీకారణ్యంలో క్రూర మృగాలు, పాములు, దోమల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. చెట్ల తొర్రల్లో దాక్కున్నామని చిన్నారులు తెలిపారు. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ గడిపామని వివరించారు. విమానంలో ఉన్న కొద్దిపాటి ఆహారంతో పాటు.. పండ్లు, ఆకులు తినడం, అడవిపై వారికి అవగాహన ఉండడం వల్ల చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అమెజాన్‌ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్న చిన్నారులకు.. ఏ పండ్లు, ఏ ఆకులు తినాలో ఏవి తినకూడదో అనే విషయంపై అవగాహన ఉండడంవారి మనుగడకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. 13, 9, 4, 11 నెలల వయస్సు ఉన్న పిల్లలు.. మరో రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చిన్నారులకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆహారం తీసకుంటున్నట్లు వివరించారు.

అమెజాన్‌ అటవీ ప్రాంతం పరిధిలోని ఆరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటోతేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్‌, పైలట్‌ ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. అనంతరం విమానం కూలిపోయింది. ప్రమాదంలో పైలట్‌, తల్లి, గైడ్‌ మరణించగా.. చిన్నారులు మాత్రం 40 రోజుల పాటు అడవిలో ఉంటూ తమను తాము కాపాడుకున్నారు.

Colombian Plane Crash 2023 : కాగా దట్టమైన అమెజాన్ అడవిలో సంచరించాలంటే పెద్దవాళ్లకే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి చోట అభం శుభం తెలియని చిన్నారులు ఏకంగా 40 రోజుల పాటు మనుగడ సాగించారు. భయంకర విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు బాలలు.. అడవిలో దొరికే ఆకులు అలములు భుజిస్తూ, అమెజాన్‌ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. మిగతావారి వయసు 13, 9, 4 ఏళ్లు. ఇన్నిరోజుల తర్వాత వీరంతా అడవిలో సజీవంగా కనిపించడం ఒక అద్భుతం. అయితే వీరికి ఏ పండ్లు, ఏ ఆకులు తినాలో ఏవి తినకూడదో ఎలా తెలిసిందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.