ETV Bharat / international

చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!

XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలం కావడమే గాక, ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్​పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

xi-jinping
చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!
author img

By

Published : May 14, 2022, 4:41 PM IST

XI Jinping Resign: చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్​పింగ్​ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పక్కకు పెట్టబోతోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం.

Jinping News: ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్​పింగ్​ను పదివి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్​ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. పార్టీ నుంచి, పదవి నుంచి జిన్​పింగ్​ వైదొలుగుతారని వివరించాడు.

Stepping Down: కరోనా కట్టడి కోసం జీరో కొవిడ్ పాలసీ పేరుతో అత్యంత కఠిన ఆంక్షలు విధించారు జిన్​పింగ్. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది. చైనా యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్​లో 4శాతం వరకు పడిపోయింది. గత 28ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్​పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్​పింగ్​పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పదవి నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: కొవిడ్​తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్​'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.