Mexico Bus Accident : మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. నయరిట్ రాష్ట్రంలో మెక్సికో కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
Bus Falls Into Gorge Mexico : 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి లోయలోకి పడిపోయింది. వెంటనే పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడిపోవడం వల్ల రెస్య్కూ ఆపరేషన్ కష్టమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
బస్సును ఢీకొట్టిన రైలు.. ఏడుగురు దుర్మరణం
Bus Train Accident Mexico : మెక్సికోలో క్రాసింగ్ వద్ద వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఎల్ మార్క్వెస్ రాష్ట్రంలో జరిగిందీ దుర్ఘటన.
అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. 27మంది మృతి
Mexico Bus Crash : ఈ ఏడాది జులైలో మెక్సికోలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఓక్సాకా రాష్ట్రంలోని మిక్స్‌టెకా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని వారు వివరించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌కు అనుభవం లేకపోవడం, అలసట కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.