ETV Bharat / international

మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలుడు.. 10మంది మృతి.. 8 మందికి గాయాలు - ఆఫ్గనిస్థాన్​లో బాంబ్ పేలుడు న్యూస్

అఫ్గానిస్థాన్​లో విషాదకర ఘటన జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

bomb blast near the main gate of Kabul Military Airport in afghanistan
మిలిటరీ ఎయిర్​పోర్టు వద్ద బాంబు పేలి పదిమంది మృతి
author img

By

Published : Jan 1, 2023, 7:16 PM IST

అఫ్గానిస్థాన్​లో దారుణం జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్​పోర్టు మెయిన్​ గేట్​కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఉత్తర తఖార్​ ప్రావిన్స్​ రాజధాని తాలూకాన్ నగరంలో బుధవారం పేలుడు జరిగి నలుగురు వ్యక్తులు గాయపడిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

తఖార్‌లోని తాలిబాన్ భద్రతా కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీ ఈ పేలుడును ధ్రువీకరించారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ డెస్క్ కింద బాంబు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారని అక్కడి వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని నెలలుగా ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.