ETV Bharat / international

'భారత్​-అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక' - పీఎం మోదీ జపాన్

Modi japan visit: టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు మోదీ. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు బైడెన్.

మోదీ
మోదీ
author img

By

Published : May 24, 2022, 12:41 PM IST

Biden modi meet: భారత్​, అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ఒకే విధంగా పోలిన ఆలోచనలు, విలువలు బంధాన్ని బలోపేతం చేశాయని అన్నారు. ఇండో పసిఫిక్​ అంశంపై ఇరు దేశాల ఆలోచన విధానం ఒక్కలాగే ఉందని తెలిపారు. జపాన్​ పర్యటనలో భాగంగా టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని భేటీ అయ్యారు. అంతకుముందు క్వాడ్​ దేశాల సమావేశంలో పాల్గొన్నారు.

"వ్యాపార, పెట్టుబడులకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ అది ఆశించిన స్థాయికి ఇంకా చేరుకోలేదు. యూఎస్​ ఇన్వెస్ట్మెంట్​ ఇన్సెంటివ్​ అగ్రిమెంట్​తో ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా కూడా బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను"

-నరేంద్ర మోదీ, ప్రధాని

భారత్‌, అమెరికా కలిసి చాలా సాధించగలవని బైడెన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సమర్థించుకోలేని రీతిలో చేస్తున్న యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాల గురించి తాము చర్చించినట్లు బైడెన్‌ వెల్లడించారు. యుద్ధం వల్ల తలెత్తిన వ్యతిరేక ఫలితాలను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సంప్రదింపులను కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : 'ఇండో పసిఫిక్​ కోసం నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.