ETV Bharat / international

బంగారం తవ్వడానికి వెళ్తూ 17 మంది మృతి - బంగారు గని కార్మికుల బస్సు ప్రమాదం

బస్సు బోల్తా పడి 17 మంది కార్మికులు మృతి చెందిన ఘటన అఫ్గానిస్థాన్​లో జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురు సైతం తీవ్రంగా గాయపడ్డారు. కార్మికులంతా.. బంగారు గని వద్దకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

afganistan road accident
అఫ్గానిస్థాన్​ రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 16, 2023, 9:18 AM IST

Updated : Mar 16, 2023, 10:23 AM IST

అఫ్గానిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి 17 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తఖర్ ప్రావిన్స్‌లోని చాహ్ అబ్ జిల్లా.. అంజీర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బంగారు గని వద్దకు కార్మికులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంజీర్ ప్రాంతంలోని చాహ్ అబ్ సెంటర్, గనుల మధ్య బస్సు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ 2020 నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్​లో ఆ ఏడాది మొత్తం ప్రమాద మరణాలు 6,033గా ఉన్నాయి. ప్రపంచంలో ప్రమాద మరణాల పరంగా అఫ్గానిస్థాన్ 76వ స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్​లోని దారుణమైన రోడ్లు, అంతగా అభివృద్ది చెందని రహదారులు కారణంగానే ఇక్కడ అంతగా రోడ్డు ప్రమాదాలు జరిగి.. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది.

మిలిటెంట్లపై పాక్​ సైన్యం కాల్పులు.. 8 మంది మృతి..
తిరుగుబాటుదారులపై పాక్​ సైన్యం దాడి చేసింది. అఫ్గానిస్థాన్​ సరిహద్దుల్లో వారు తలదాచుకుంటున్న స్థావరాలపై కాల్పులు జరిపింది. ఘటనలో ఎనిమిది తిరుగుబాటుదారులు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు. ఇద్దరు సైనికులు గాయాల పాలయ్యారు. ఘటనపై మాట్లాడిన సైనిక అధికారులు.. చనిపోయిన మిలిటెంట్లను ఇంకా గుర్తించలేదని వెల్లడించారు. వారంతా ఏ గ్రూప్​ చెందిన వారో ఇంకా సృష్టంగా తెలియదన్నారు.

వాయవ్య ఖైబర్ పఖ్​తున్‌ఖ్​వా ప్రావిన్స్‌లోని దక్షిణ వజీరిస్థాన్​లోని ఔట్​పోస్ట్​పై ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో చనిపోయిన ఇద్దరు చిన్నారులను ఎవరి చంపారనేది సృష్టంగా తెలియలేదు. దక్షిణ వజీరిస్థాన్​ గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థానీ తాలిబన్​ ఉగ్రవాదులకు, ఇతర మిలిటెంట్లకు స్థావరంగా ఉంది. ఈ స్థావరం నుంచి తిరుగుబాటుదారులను పూర్తిగా తొలగించినప్పటికీ.. అప్పుడప్పుడు ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పాకిస్థాన్​ సైనిక అధికారులు చెబుతున్నారు.

సైనిక జుంటాకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు..
మయన్మార్​లోనూ తిరుగుబాటు దారులకు, సైనిక మద్దతు గల జుంటాకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో ఈ కాల్పులు జరిగాయి. శనివారం ఈ ఘటన జరిగింది.ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆదివారం సామాజిక మధ్యమాల్లో విడదలయ్యాయి. రక్తం మడుగులో మృతుల శరీరాలు పడి ఉన్నాయి. అందులో బుద్ధ సన్యాసులు కూడా ఉన్నారు. మఠం సైతం తూటాల రంధ్రాలతో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

Last Updated : Mar 16, 2023, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.